Begin typing your search above and press return to search.
నాగార్జునతో 'రైడ్' చేయించే ఛాన్స్ ఎవరిదో మరి!
By: Tupaki Desk | 14 Dec 2020 11:37 AM ISTఅక్కినేని నాగార్జున. టాలీవుడ్లో ప్రయోగాలకు పెట్టింది పేరు.కెరీర్ ప్రారంభమైనప్పటినుంచి నాగార్జున ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేశారు. రిస్క్ చేసి మరీ కొత్త దర్శకులతో సినిమాలు చేశారు. కొత్త దర్శకులతో చేస్తే ప్లాప్స్ వస్తాయేమో అన్న భయం ఆయనలో లేదు. ఫ్లాప్స్ వచ్చినా కూడా ఎప్పుడూ వెరసింది లేదు. కొత్త దర్శకులతో ఆయన చేసిన సినిమాలు ఎన్నో సంచలన విజయాలు సాధించాయి. శివ, గీతాంజలి, మాస్, నువ్వు వస్తావని, సంతోషం అలా సూపర్ హిట్లు అందుకున్నవే.
బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్ సినిమా తెలుగులో చేసేందుకు నాగార్జున ఆసక్తి చూపాడు. తనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావించాడు. ఇందుకోసం పలువురు దర్శకుల పేర్లు పరిశీలించారట. కానీ ఎవరూ సెట్ కాలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమా రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారట. ఆ కథ నాగార్జునకు సరిపోయే విధంగా మార్పులు చేర్పులు చేశారట.
అయితే నాగార్జున రైడ్ రీమేక్ బాధ్యతలు అప్పగించేందుకు సొలేమున్ ను సంప్రదించగా.. అతడు మాత్రం వైల్డ్ డాగ్ ఒరిజినల్ స్క్రిప్ట్ తో నాగార్జునని మెప్పించాడు. దీంతో నాగార్జున రైడ్ ని తాత్కాలికంగా పక్కన పెట్టి వైల్డ్ డాగ్ సినిమాని పట్టాలు ఎక్కించాడు. ఆ సినిమా కొన్ని నెలలుగా షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే రైడ్ సినిమా చేయాలనే ఆలోచన మాత్రం నాగార్జున మనసులో ఉంది. ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలా.. అని నాగార్జున సెర్చ్ చేస్తున్నాడట.