Begin typing your search above and press return to search.

జేమ్స్ బాండ్ జోడీలా ` ఘోస్ట్` జోడీ వైర‌ల్!

By:  Tupaki Desk   |   21 Aug 2022 7:33 AM GMT
జేమ్స్ బాండ్ జోడీలా ` ఘోస్ట్` జోడీ వైర‌ల్!
X
కింగ్ నాగార్జున‌ క‌థానాయ‌కుడిగా యంగ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ` ది ఘోస్ట్` రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కింగ్ ప‌వ‌ర్ ఫుల్ ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన నాగ్ పోస్ట‌ర్లతోనే క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన `ఘోస్ట్` కిల్లింగ్ మిష‌న్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

ఆఫీస‌ర్ లుక్ లో నాగ్ యాక్ష‌న్ మైండ్ బ్లోవింగ్ అనిపించింది. స్పెష‌ల్ యాక్ష‌న్ బ్లాక్ ఫ్యాన్స్ స‌హా ఆడియ‌న్స్ ని ఫిదా చేసింది. ఇక టీజ‌ర్...ట్రైల‌ర్ తో డ‌బుల్ ట్రీట్ షురూ అవుతుంద‌ని ఫ్యాన్స్ కాన్పిడెంట్ గా ఉన్నారు. తాజాగా ఘోస్ట్ మ‌రో కొత్త పోస్ట‌ర్ తో దిగిపోయాడు. రెండు చేతుల్లో గ‌న్స్..మ‌ధ్య‌లో సోనాల్ చౌహాన్ కింగ్ కౌగిలి మ‌ధ్య‌లో డాషింగ్ లుక్ లో సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నారు.

స్టన్నింగ్ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. పోస్ట‌ర్ బ్యాక్‌గ్రౌండ్‌లోని శిధిలాలు.. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లోని స్టిల్‌గా చెప్పొచ్చు. ఇద్ద‌రు జెమ్స్ బాండ్ త‌ర‌హా జోడీలా బుల్లెట్ ప్రూప్ లెద‌ర్ జాకెట్ ధ‌రించి ప్ర‌త్య‌ర్ధుల‌పై ఘోస్ట్ జోడీ గుళ్ల వ‌ర్షం కురిపించారు. పోస్టర్ సినిమాపై హైప్‌ని మరింత పెంచితుంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్తిచేసి అక్టోబర్ 5న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి- నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నాయి.

నాగార్జున ఇటీవ‌లి కాలంలో క‌మర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ జాన‌ర్ల‌ని ట‌చ్ చేస్తున్నారు. వైల్డ్ డాగ్ తో న‌టుడిగా ప్ర‌త‌మ్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. కమ‌ర్శియ‌ల్ గా ఆశించిన అంచాన‌లు అందుకోలేక‌పోయినా విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. అటుపై `బంగార్రాజు` చిత్రంతో అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న‌ `ది ఘోస్ట్` రోల్ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఇలా నాగ్ రెండు జాన‌ర్ల‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.