Begin typing your search above and press return to search.

నాగ్ ఘోస్ట్‌.. దసరా ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌

By:  Tupaki Desk   |   10 July 2022 7:57 AM GMT
నాగ్ ఘోస్ట్‌.. దసరా ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌
X
వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న సినిమా లపై ఒక స్పష్టత వచ్చింది.. కాని ఈ ఏడాదిలో అతి త్వరలో రాబోతున్న దసరాకు రాబోతున్న సినిమాల విషయంలో క్లారిటీ లేదు. దసరాకు చిరు.. బాలయ్య సినిమాలతో మరికొన్ని సినిమాలు కూడా వస్తాయి.. రాబోతున్నాయి అనే వార్తలు ఇన్ని రోజులగా వస్తున్నాయి.. వచ్చాయి. కాని ఏ ఒక్క సినిమా విడుదల తేదీ స్పష్టం కాలేదు.

నాగార్జున సినిమా ది ఘోస్ట్‌ ను అనూహ్యంగా దసరా సీజన్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం మాత్రమే కాకుండా అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ది ఘోస్ట్ సినిమా విడుదల ఈ ఏడాది ఉంటుంది కానీ ఎప్పుడు అనే విషయమై స్పష్టత లేదు. కానీ తాజాగా ఆ క్లారిటీ నాగార్జున ముసుగులో గుద్దులాట లేకుండా ఇచ్చేశారు.

ది ఘోస్ట్‌ సినిమా దసరాకు కన్ఫర్మ్‌ అయ్యింది. కాని ఇతర సినిమాల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ది ఘోస్ట్‌ సినిమా తో పాటు దసరాకు రాబోతున్న సినిమాలు ఏంటీ అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. మొన్నటి వరకు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా దసరాకు అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవలే కన్ఫర్మ్‌ చేశారు కాని విడుదల తేదీ ని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు.

బాలయ్య 107 సినిమాను కూడా దసరాకు విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. దాంతో దసరా సీజన్ లో ఒకే రోజు కాకున్నా రెండు మూడు రోజుల గ్యాప్ తో లేదా వారం గ్యాప్‌ తో అయినా ఈ ముగ్గురు బడా స్టార్స్ బాక్సాఫీస్ వద్దకు వచ్చి పోటీ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ మూడు సినిమాలు కూడా దసరాకి వస్తే ప్రేక్షకులకు పండుగే.

ఈమద్య కాలంలో సినిమాలు పోటీ పడి వస్తే కమర్షియల్‌ గా నిరాశ పర్చడం జరుగుతుంది. థియేటర్లకు జనాలు గతంతో పోల్చితే అంతగా రావడం లేదు. అందుకే పెద్ద హీరోల సినిమాలు గ్యాప్ లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజీ తప్పదు. మరి ఆ డ్యామేజీ ఎవరికి అనేది కూడా ఇక్కడ ఆసక్తికర విషయం.