Begin typing your search above and press return to search.

నాగార్జున `ఘోస్ట్` లో బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీ!

By:  Tupaki Desk   |   18 March 2022 2:30 AM GMT
నాగార్జున `ఘోస్ట్` లో బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీ!
X
కింగ్ నాగార్జున బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `వైల్డ్ డాగ్` త‌ర్వాత ఇటీవ‌లే `బంగార్రాజు`తో మ‌రో క‌మ‌ర్శియ‌ల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో `ది ఘోస్ట్` అనే థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. దుబాయ్ లో షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే అక్క‌డ లోకేష‌న్ల‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్ లోని మండే ఎండ‌ల న‌డుమ `ఘోస్ట్` చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

అయితే ఖాళీ స‌మ‌యంలో కింగ్ అదే మాదిరి చిలౌట్ అవుతున్నారు. అడిగిన వారికి సెల్ఫీలు ఇస్తూ అంద‌ర్నీ సంతోష పెడుతున్నారు. ఇదే స‌మ‌యంలో నాగార్జున‌కే ఓ వ్య‌క్తితో ఫోటో దిగాలినిపించింది. ఆ వ్య‌క్తి ప్ర‌త్యేక‌త‌ల్ని కింగ్ అభిమానుల‌కు షేర్ చేయాల‌నిపించింది. కింగ్ అలా చేసి ట్విట‌ర్లో వాటిని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కింగ్ సెల్ఫీ దిగిన వ్య‌క్తి ఎవ‌రో కాదు. `ఓఎక్స్ పాలిగావ‌న్` సంస్థ కో ఫౌండర్ సందీప్ నైల్ వాల్. ఇత‌ను దుబాయ్ లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ లో బ్లాక్ చెయిన్ టెక్నాలీజీ పై ప‌నిచేస్తున్నారు.

సందీప్ తో కింగ్ బ్లాక్ చెయిన్ ప్యూచ‌ర్ టెక్నాల‌జీ గురించి చ‌ర్చించిన‌ట్లు వివ‌రించారు. ప్ర‌స్తుతం బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సెల‌బ్రిటీలు ఉత్సాహం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న బిజినెస్ మెన్ లు..సెల‌బ్రిటీలు స్పోర్స్ట్ ఐకాన్స్ బ్లాక్ టెక్నీల‌జీపై ఆస‌క్తి చూపిస్తున్నారు. ఎల‌న్ మ‌స్క్..టిమ్ కుక్ వంటి వారు ఇప్ప‌టికే క్రిప్టో క‌రెన్సీలు పెట్టుబ‌డులు పెట్టగా స‌చిన్ టెండూల్క‌ర్..అమితాబ‌చ్చ‌న్ లాంటి వారు రంగంలోకి దిగారు.

మ‌రి కింగ్ కూడా అదే మాదిరి ప్లాన్ చేస్తున్నారా? ఏమో కొన్ని గంట‌ల పాటు సందీప్ తో నాగార్జున చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా క్రిప్టోలో పెట్టుబ‌డులు పెడుతున్నారంటూ మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి. ఇంకొంద‌రు ఎన్ ఎఫ్ టీలు కోస‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రికొంత మంది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఓల్డ్ హిట్స్ అన్నింటిని డిజిట‌లైజేష‌న్ చేయ‌డం కోసం ప్యూచ‌ర్ టెక్నాల‌జీ అయిన బ్లాక్ చెయిన్ గురించి నాగార్జున తెలుసుకునే ప్ర‌య‌త్న‌మ‌ని అంటున్నారు. ఇవ‌న్నీ గాక బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీని ఘోస్ట్ సినిమా కోసం వినియోగిస్తున్నారా? అన్న సందేహం త‌లెత్తింది. మ‌రి ఇందులో ఏది నిజమో తెలియాలంటే నాగార్జున నోరు విప్పాల్సిందే.