Begin typing your search above and press return to search.

బంగార్రాజు మళ్లీ ఓ వార్తతో వచ్చాడు

By:  Tupaki Desk   |   22 Jun 2021 12:30 PM GMT
బంగార్రాజు మళ్లీ ఓ వార్తతో వచ్చాడు
X
నాగార్జున సూపర్‌ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన విడుదలైనప్పటి నుండి కూడా అదుగో ఇదుగో బంగార్రాజు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ మొదలైందని.. లేదు ఇంకాస్త సమయం పడుతుందని ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు మరియు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్‌ బంగార్రాజు మొదలు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి షూటింగ్‌ ఎట్టి పరిస్థితుల్లో బంగ్రారాజు మొదలు అవుతుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కోసం కీలక పాత్రకు గాను సీనియర్ నటి జయప్రదను ఎంపిక చేశారట. సినిమాలో ఆమె పాత్ర ఏంటీ అనేది స్పష్టత లేదు. బంగార్రాజులో జయప్రధ నటించబోతున్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కాకుండా ఒక ట్రెండ్డింగ్‌ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

నాగార్జునతో పాటు అఖిల్ మరియు నాగచైతన్యలు కూడా ఈ సినిమా లో ఉంటారని కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నాగార్జున మరియు అఖిల్‌ ల కాంబోలో ఉండే కొన్ని సన్నివేశాలు అద్బుతంగా డిజైన్‌ చేశారని.. తాత మనవడి పాత్రల్లో వీరు కనిపించే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారట.