Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఇంటి ముందు 4 నెలలు పడిగాపు!

By:  Tupaki Desk   |   21 Sept 2018 3:13 PM IST
ఎన్టీఆర్‌ ఇంటి ముందు 4 నెలలు పడిగాపు!
X
నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ చిత్రం ఆడియో పార్టీ నిన్న రాత్రి వైభవంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు సమంత - అఖిల్‌ - సుశాంత్‌ ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా సరదాగా సాగింది. సుమ యాంకర్‌గా వ్యవహరించింది. ఇక ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ అందరిని నవ్వించాడు. తాను ఈ చిత్రంను చేయడానికి గల కారణంను వివరించిన నాగార్జున నాని - రష్మిక ఇంకా అశ్వినీదత్‌ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నాగార్జున మాట్లాడుతూ.. తాను ఈ చిత్రం చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి. శ్రీరామ్‌ కథ చెప్పగానే నచ్చింది. మొదటి కారణం కథ కాగా - రెండవ కారణంగా అశ్వినీదత్‌ ఈ చిత్రంను నిర్మించేందుకు ముందుకు రావడం. ఇక నానితో ఈ చిత్రం అనగానే మరో మారు ఆలోచించకుండా వెంటనే సినిమాకు కమిట్‌ అయ్యాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు చాలా సరదాగా సాగిపోయిందని - నానితో వర్క్‌ చాలా బాగుందని - నాని డైలాగ్‌ డెలవరీ తనకు చాలా ఇష్టం అంటూ నాగార్జున అన్నాడు.

అశ్వినీదత్‌ గురించి నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్‌ నిర్మాతగా మొదటి చిత్రం ‘ఒక సీత కథ’. ఆ చిత్రం విడుదల అయ్యే సమయంకు ఆయన వయసు కేవలం 24 ఏళ్లు. ఎన్టీఆర్‌ గారితో సినిమా చేయాలనే పట్టుదలతో ఉదయాన్నే 4 గంటలకు ఆయన నిలబడి ఎదురు చూసేవారు. నాలుగు నెలల పాటు అలా ఎదురు చూస్తే ఎన్టీఆర్‌ అప్పుడు అశ్వినీదత్‌ అవకాశం ఇచ్చాడట. వైజయంతి మూవీస్‌ అంటూ ఎన్టీఆర్‌ బ్యానర్‌ కు పేరు పెట్టడం జరిగింది. రావోయి చందమామ చిత్రంతో ఐశ్వర్యరాయ్‌ ని టాలీవుడ్‌ కు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.