Begin typing your search above and press return to search.

ఎగ్జోటిక్ డెస్టినేష‌న్ లో కింగ్ స్పెష‌ల్ డే

By:  Tupaki Desk   |   10 Aug 2019 5:26 AM GMT
ఎగ్జోటిక్ డెస్టినేష‌న్ లో కింగ్ స్పెష‌ల్ డే
X
కింగ్ నాగార్జున న‌టించిన `మ‌న్మ‌ధుడు 2` ఈ శుక్ర‌వారం రిలీజైన సంగ‌తి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. నాగ్ అండ్ టీమ్ ప్ర‌మోష‌న్స్ లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. ఓపెనింగ్ వీకెండ్ వ‌సూళ్ల‌తో పాటు.. ఈ వారంలో రెండు మూడు సెల‌వులు వ‌సూళ్ల‌కు క‌లిసొస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆదివారం.. బ‌క్రీద్ సోమ‌వారం.. ఆగ‌స్టు 15 సెల‌వులు మ‌న్మ‌ధుడి క‌లెక్ష‌న్స్ కి ప్ల‌స్ కానున్నాయి. `మ‌న్మ‌ధుడు 2` రిలీజ్ డే రోజునే ద‌ర్శ‌కుడు రాహుల్ రవీంద్ర‌న్ `చి.ల‌.సౌ`కి జాతీయ పుర‌స్కారం శుభ‌వార్త అందింది.

ఇక సినిమా సంగ‌తి అటుంచితే కింగ్ నాగార్జున త‌న లైఫ్ లో వెరీ స్పెష‌ల్ సెల‌బ్రేష‌న్స్ కి రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఏంటి అంత స్పెష‌ల్? అంటే.. ఆగ‌స్టు 29న‌ ఆయ‌న బ‌ర్త్ డే. పైగా ఆ రోజుతో నాగార్జున వ‌య‌సు 60. అంటే ష‌ష్ఠిపూర్తి చేసుకోబోతున్నార‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని నాగార్జుననే మొన్న ఒక వేదిక‌పై ప్ర‌త్యేకంగా గుర్తు చేశారు. నా వ‌య‌సు 30 (ఆల్మోస్ట్ డ‌బుల్) అంటూ బ‌హిరంగంగానే చెప్పారు.

కింగ్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని ఈసారి చాలా స్పెష‌ల్ గా చేయాల‌న్న‌ది వార‌సులు నాగ‌చైత‌న్య‌- అఖిల్ ప్లాన్ అని తెలుస్తోంది. ఈ వేడుక‌ల్ని కింగ్ కి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేశార‌ట‌. నాగార్జున ఫేవ‌రెట్ ప్లేస్ అయిన‌ ఎగ్జోటిక్ డెస్టినేష‌న్ స్పెయిన్ -ఇబిజాలో బ‌ర్త్ డే వేడుక‌ల్ని సెల‌బ్రేట్ చేసేందుకు ముంద‌స్తు ప్లాన్ ని సిద్ధం చేశారు. అక్క‌డికి కుటుంబ స‌భ్యుల‌తో పాటు నాగార్జున చిన్న‌నాటి స్నేహితులు.. వారి కుటుంబాలు వెళ‌తాయ‌ని తెలుస్తోంది. స్పెయిన్ లోనే కొన్ని రోజుల పాటు కుటుంబ స‌మేతంగా స్పెండ్ చేసేలా కార్య‌క్ర‌మాన్ని డిజైన్ చేశార‌ట‌.