Begin typing your search above and press return to search.

సినిమా కోసం నాగ్ కండిషన్

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:08 PM GMT
సినిమా కోసం నాగ్ కండిషన్
X
ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో కింగ్ నాగార్జున. పాత్ర ఎలాంటిదైనా సరే తన గ్లామర్ ని సైతం లెక్కచేయకుండా నటించే నాగ్ చిత్ర విజయం కోసం తన శక్తికి మించి పనిచేస్తాడు. ముఖ్యంగా ప్రమోషన్స్ వంటి విషయంలో నాగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా సినిమాను ముందుకు తీసుకువెళతాడు.

అయితే ఇప్పుడు అదే తరహాలో నాగ్ రాబోయే "రాజు గారి గది 2" కోసం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా దాదాపు పూర్తి కావచ్చింది కానీ నాగ్ మళ్లీ కొన్ని సీన్స్ సరిగ్గా రాకపోవడంతో రీషూట్ చేయించాడు. అలా చేయడం సినిమా మంచికే అని కూడా నాగ్ వివరించాడు. అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన వేడుక సందర్భంగా నాగ్ రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించాడు. అయితే ఈ వేడుకలో హీరోయిన్ సమంత తప్ప చిత్ర యూనిట్ లోని అందరూ హాజరయ్యారు.

కాకపోతే నాగార్జున సినిమా కోసం ఒక కండిషన్ ని చిత్రం యూనిట్ ముందు ఉంచాడు. VFX పనులు అనుకున్నట్లు సూపర్బ్ గా వస్తేనే డబ్బింగ్ పనులను పూర్తి చేస్తానని చెప్పాడు. దీంతో చిత్ర యూనిట్ చాలా జాగ్రతగా ఆ పనులను నిర్వహిస్తోందట. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా దీపావళి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.