Begin typing your search above and press return to search.

ఇదీ నా పౌరుషం అంటున్న నాగ్

By:  Tupaki Desk   |   1 Feb 2016 11:30 AM GMT
ఇదీ నా పౌరుషం అంటున్న నాగ్
X
40 కోట్ల క్లబ్బులో చేరిన సందర్భంగా మీసం మెలేసి మరీ పోస్టర్లు వదిలాడు అక్కినేని నాగార్జున. ‘40 కోట్ల షేర్ దాటిపోయాం’ అంటూ నాగ్ మీసం మెలేసి కనిపిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ కొత్త పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. రెండు వారాల్లోనే రూ.35 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూడో వీకెండ్లోనూ దుమ్ము దులిపింది. రెండో వీకెండ్ అయ్యాక వీక్ డేస్ లోనూ ఓ మోస్తరు కలెక్షన్లు సాధించిన నాగ్ సినిమా.. వీకెండ్ వచ్చేసరికి అదరగొట్టింది. మూడు రోజుల్లో రూ.5 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రూ.40 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రికార్డును అందుకుంది. నాగార్జున కెరీర్లో ఇదే హైయెస్ట్ షేర్. అది కూడా మూడో వీకెండ్ పూర్తయ్యేసరికే ఈ ఘనత సాధించడం మామూలు విషయం కాదు.

ఇక సోగ్గాడి వసూళ్ల ప్రభంజనం ఏ స్థాయిలో సాగుతోందో చెప్పడానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వస్తున్న కలెక్షన్లే నిదర్శనం. నిన్న ఆదివారం క్రాస్ రోడ్స్ లో ఉన్న ఎనిమిది థియేటర్లలో కలిపి హౌస్ ఫుల్స్ పడింది ఐదు షోలకు మాత్రమే. అందులో మూడు షోలు ‘సోగ్గాడే చిన్నినాయనా’వి కావడం విశేషం. సంధ్య 35 ఎంఎం థియేటర్లలో ఒక్క మార్నింగ్ షో మినహాయిస్తే మిగతా మూడు షోలకూ ఫుల్స్ పడ్డాయి. నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకు ఫస్ట్ షో మాత్రం ఫుల్లయింది. శనివారం కూడా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫస్ట్ షో, సెకండ్ షో ఫుల్స్ పడటం విశేషం. మరే సినిమా కూడా ఆ రోజు ఫుల్ అవలేదు. దీన్ని బట్టే బాక్సాఫీస్ దగ్గర నాగ్ హవా ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.