Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ పై స్పందించిన నాగ్

By:  Tupaki Desk   |   7 Aug 2019 7:58 AM GMT
త్రివిక్రమ్ పై స్పందించిన నాగ్
X
లేటెస్ట్ గా 'మన్మధుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'మన్మధుడు' డైరెక్టర్ విజయ్ భాస్కర్ గురించి దేవి శ్రీ గురించి మాట్లాడిన నాగ్ ఆ సినిమాకు కథ మాటలు అందించిన త్రివిక్రమ్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం హాట్ టాపిక్ గా మారింది. పైగా సినిమాలో పంచ్ లకు కూడా విజయ్ భాస్కర్ కె ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈవెంట్ అయిన వెంటనే త్రివిక్రమ్ ఫాన్స్ నాగ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ కూడా వేశారు.

ఆ విషయంపై లేటెస్ట్ గా ఇంటర్వ్యూ లో నాగ్ స్పందించారు. నాకు మన్మధుడు కథ చెప్పింది విజయ్ భాస్కర్ గారే, రోజు నన్ను కలిసి నాతో పంచ్ లు చెప్పింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను... అంటూ చెప్తూ... నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటూ ఆ విషయాన్ని క్లోజ్ చేసాడు.

నిన్నటి వరకూ నాగ్ త్రివిక్రమ్ పేరు అనుకోకుండా మర్చిపోయి ఉంటారని భావించిన అందరికీ ఇలా మాట్లాడి షాక్ ఇచ్చాడు నాగ్. త్రివిక్రమ్ పై నాగ్ స్పందించిన తీరు చూస్తే నాగార్జున - త్రివిక్రమ్ కి ఏదో ఇన్సైడ్ వార్ ఉందనే విషయం అర్ధం అవుతోంది. మరి నాగ్, త్రివిక్రమ్ కి అగ్గి రాజేసుకుంది నాగ చైతన్య సినిమా విషయంలోనే అని భోగట్టా.