Begin typing your search above and press return to search.

కోడ‌లితో చేసిన చాట్‌ ను పోస్ట్ చేసిన నాగ్‌

By:  Tupaki Desk   |   17 May 2017 2:13 PM GMT
కోడ‌లితో చేసిన చాట్‌ ను పోస్ట్ చేసిన నాగ్‌
X
మామా కోడ‌ళ్ల మ‌ధ్య ఎంత‌టి ఆత్మీయ అనురాగాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేసింది నాగ్ తాజాగా పోస్ట్ చేసిన చాట్ ఇమేజ్‌. కాబోయే కోడ‌లు.. ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంతతో మామ క‌మ్ టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున చాట్‌ను త‌న అభిమానుల‌కు ట్వీట్ చేశారు. ఇంత‌కీ వీరిద్ద‌రి ఛాటింగ్ ఎవ‌రి గురించి? ఏం మాట్లాడుకున్నారు? అన్న‌ది చూస్తే..

ఇటీవ‌ల నాగ‌చైత‌న్య న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. అమ్మాయి మ‌న‌శ్శాంతికి హానిక‌రం అంటూ వ‌చ్చిన ఈ టీజ‌ర్‌ కు మంచి టాక్ వ‌చ్చింది. ట్రైల‌ర్ చాలా న‌చ్చింద‌ని.. నాగ‌చైత‌న్య చాలా బావున్న విష‌యాన్ని స‌మంత పేర్కొంది. కోడ‌లా అంటూ నాగార్జున మాట‌కు కోడ‌లు పిల్ల ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు అంద‌రిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/