Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ టైప్ రోల్ లో...

By:  Tupaki Desk   |   15 Feb 2017 2:38 PM GMT
సూపర్ స్టార్ టైప్ రోల్ లో...
X
రాజు గారి గది సీక్వెల్ లో అక్కినేని నాగార్జున నటించేందుకు ఓకే చెప్పడమే.. కొన్ని నెలల క్రితం ఓ సెన్సేషన్ అయిపోయింది. ఓంకార్ దర్శకత్వంలో సినిమాకి నాగ్ సరే అనడమే అన్నిటికంటే పెద్ద హైలైట్. అయితే.. ఇలాంటి ప్రయోగాలకు వెరిసే మెంటాలిటీ కాదు నాగార్జున. కొత్త డైరెక్టర్లనే కాదు.. ప్రయోగాలు కూడా చేయడం ఆయనకు అలవాటే.

అయితే.. రాజు గారి గది2 లో నాగ్ చేస్తున్నది కేవలం గెస్ట్ పాత్ర మాత్రమేనని.. కాసింత ఎక్కువ సేపు కనిపించే కేమియో అనే టాక్ వినిపించింది. అయితే.. ఈ సినిమాలో నాగ్ చేస్తున్నది ఫుల్ లెంగ్త్ రోల్ అంటున్నారు. అలాగే ఈయన ఓ మైండ్ రీడింగ్ పర్సనాలిటీ అయిన మెంటలిస్ట్(మనో విజ్ఞానవేత్త అనుకోవచ్చు)గా కనిపిస్తాడట. అంటే ఎదుటి వాళ్ల మనసులో ఉన్నది తను చెప్పేయగలిగే మైండ్ రీడర్ అన్నమాట. అలాగే ఓ ఫ్యాన్సీ బైక్ ను రైడింగ్ చేస్తూ.. కొత్త గెటప్ లో కనిపిస్తారని అంటున్నారు.

మైండ్ రీడింగ్ ప్లస్ హారర్.. ఈ రెండు కలిపి మిక్స్ చేసి చూస్తే.. చంద్రముఖి మూవీలో రజినీకాంత్ ఇలాంటి రోల్ నే చేస్తాడు. సినిమాలో లీడ్ రోల్స్ వేరే ఉన్నా.. సినిమా అంతా సూపర్ స్టార్ కనిపించే కథ అది. ఇప్పుడు నాగ్ కూడా సూపర్ స్టార్ మాదిరిగానే మైండ్ రీడర్ పాత్ర చేయబోతున్నాడన్న మాట. మరోవైపు సమంత ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనుందనే టాక్ కూడా కాదని చెబుతున్నారు. ఓ ఎమోషనల్ రోల్ లో కనిపించనుందట శామ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/