Begin typing your search above and press return to search.

అఖిల్ 'హలో' అందుకే!!

By:  Tupaki Desk   |   28 Aug 2017 1:06 PM GMT
అఖిల్ హలో అందుకే!!
X
ప్రస్తుత రోజుల్లో కొన్ని సినిమా టైటిల్స్ కేవలం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడానికి మాత్రమే పెడతారు. ఇంకొన్ని సినిమాల్లోని పాటలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఇక సినిమా కంటెంట్ ని బట్టి కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది డిసైడ్ చేస్తారు. కాని ప్రస్తుత రోజుల్లో అలాంటి టైటిల్స్ ఎవరు అంతగా నిర్ణయించడం లేదు. కానీ హీరో అక్కినేని అఖిల్ మాత్రం తన సినిమాలో ఉన్న ఒక కంటెంట్ ఆధారంగా ఉండే టైటిల్ తోనే వస్తున్నాడట.

ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున రీసెంట్ గా తెలిపారు. అఖిల్ 2వ సినిమాకు "హలో" అనే టైటిల్ ఎందుకుపెట్టమంటే.. సినిమాలో హీరో తన ప్రియురాలి చేత తరచు హలో అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాడని . ఎక్కువగా ఈ కాన్సెప్ట్ చుట్టే కథ తిరగడం వల్ల అందుకే అందుకే హలో అనే టైటిల్ అని నాగ్ చెప్పాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రేక్షకుల చేత హలో అనిపించిన నాగార్జున. సినిమాకి బాగానే ప్రమోషన్స్ నిర్వహించారు. టైటిల్ కే ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాడంటే ఇక టీజర్ - ట్రైలర్ వస్తే ఏ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తాడో అనే ఆసక్తి నెలకొంది. మొదటి సినిమా అఖిల్ తీవ్ర నిరాశపరచడంతో అఖిల్ తెగ కష్టపడుతున్నాడు.

రెండవ సినిమా "హలో" టైటిల్ కూడా చాలా బావుంది అని టాక్ రావడంతో త్వరలో చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా టీజర్ కి ప్లాన్ చేస్తున్నాడని టాక్. నాగ్ ఫ్యామిలీకి మనం లాంటి మంచి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు అఖిల్ సెకండ్ సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తాడో చూడాలి.