Begin typing your search above and press return to search.

నాని సీక్రెట్ బయటపెట్టిన నాగ్

By:  Tupaki Desk   |   23 Sept 2018 2:46 PM IST
నాని సీక్రెట్ బయటపెట్టిన నాగ్
X
అక్కినేని నాగార్జున - నాని కలిసి నటించిన మల్టిస్టారర్ 'దేవదాస్' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు 'దేవదాస్' టీమ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ తో ప్రమోషన్స్ చేస్తోంది. తాజా నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేస్తూ "నన్ను విసిగించే ఫ్రెండ్ దాసు.. మీ ఫ్రెండ్ ను కూడా ట్యాగ్ చేయండి #దేవదాస్ సెప్టెంబర్ 27 న" అని ట్వీట్ చేశాడు.

ఆ వీడియోలో న్యాచురల్ స్టారుకున్న ఫోన్ అడిక్షన్ ను అక్కినేని వారు సరదాగా ఆటపట్టించారు. ఎప్పుడూ చూసిన ఫోన్ లో ఏదో చూస్తూ కనిపిస్తాడని... వన్ మినిట్ అంటాడని.. అసలు ఎప్పుడూ ఆ ఫోన్ లో ఏం చూస్తుంటాడో అని సందేహం వ్యక్తం చేశాడు. పక్కన ఒక అందమైన అమ్మాయి ఉన్నా కూడా చూడడు.. ఫోన్ నే చూస్తుంటాడని చెప్పాడు. అలా చూస్తున్న వీడియో క్లిప్స్ కూడా వీడియో కు జత చేశాడు.

నిజంగానే ఫోన్ పట్టుకుని అదో లోకంలో ఉన్నాడు నాని.. తనలో తాను నవ్వుకోవడం.. మురిసిపోవడం.. మధ్య మధ్యలో మెసేజులు టైప్ చెయ్యడం ఇలా ఉంది దాసుగారి వరస! నాని ఇలా మల్టి స్టారర్స్ చేయడం మంచిదే.. ఇలా చేస్తేనే కదా అలాంటి సీక్రెట్ లు బయటకు వచ్చేది.