Begin typing your search above and press return to search.

నాగ్ మైసూర్ వెళ్లింది అందుకేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2015 10:01 AM GMT
నాగ్ మైసూర్ వెళ్లింది అందుకేనా?
X
సోగ్గాడే చిన్నినాయనా అంటూ సరికొత్త అవతారంలో రాబోతున్నాడు అక్కినేని నాగార్జున. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా ఎప్పుడో పూర్తయి.. ఈపాటికి రిలీజ్ కు రెడీ అవుతుండాలి. కానీ ఓ దశ దాటాక ఔట్ పుట్ చూసుకుంటే నాగ్ శాటిస్ఫై అవలేదు. ఇంతకముందు ‘భాయ్’ సినిమా విషయంలో లైట్ తీసుకుంటే ఏం జరిగిందో తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ కు ఎక్కడలేని చెడ్డ పేరు వచ్చింది. మరోసారి బేనర్ వాల్యూకి దెబ్బ పడకూడదని సినిమాను మధ్యలో ఆపాడని.. సాయిమాధవ్ బుర్రాతో పాటు ఇంకొందరు రచయితల సహకారంతో స్క్రిప్టు తిరగరాయించాడని వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఐతే ఎక్కడ అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. ఐతే ‘అఖిల్’ ఆడియో ఫంక్షన్ కు నాగ్ మైసూరు నుంచి వస్తున్నాడన్న సమాచారంతో సోగ్గాడే.. షూటింగ్ అక్కడే జరుగుతోందని తెలిసింది. దీన్ని బట్టే సోగ్గాడే రీషూట్ పక్కా అని తేలిపోయింది. నాలుగైదు నెలల కిందటే అక్కడ షూటింగ్ చేసింది సోగ్గాడే.. యూనిట్. అంతటితో మైసూర్ పార్ట్ షూటింగ్ అంతా అయిపోయిందని కూడా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అక్కడే షూటింగ్ జరుగుతోందంటే కొన్ని కీలక సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారన్నమాట. విడుదల తర్వాత బాధపడ్డం కంటే ముందే ఇలా జాగ్రత్త పడటం మంచిదే. అదనంగా ఖర్చయినా పర్వాలేదు ఔట్ పుట్ బాగొస్తే అంతే చాలు.