Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : నాగ్‌ పునః ప్రారంభం

By:  Tupaki Desk   |   4 Aug 2021 8:00 PM IST
పిక్ టాక్‌ : నాగ్‌ పునః ప్రారంభం
X
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సెకండ్‌ లాక్‌ డౌన్‌ కు ముందు షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. జెట్‌ స్పీడ్‌ తో సాగుతున్న షూటింగ్‌ కు కరోనా వల్ల బ్రేక్‌ పడింది. మళ్లీ ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించారు. సినిమాకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యిందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఫొటోను యూనిట్‌ సభ్యులు షేర్‌ చేశారు. నాగార్జున ను వెనుక నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు చూపించారు. సినిమాలో మంచి ఫిజిక్‌ తో మరింత వయసు తగ్గి కనిపించబోతున్నట్లుగా ఈ బ్యాక్‌ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్‌ గా కనిపించబోతున్నాడని సమాచారం అందుతోంది. గత చిత్రంను మించి ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు.. కఠినమైన ఫైరింగ్‌ సన్నివేశాలు ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా లో నాగార్జున ది బెస్ట్‌గ ఆ కనిపించబోతున్నాడు అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నాగార్జునను ఈ సినిమాలో ప్రవీణ్‌ సత్తార్‌ గతంలో ఎప్పుడు చూడని విధంగా చూపిస్తాడని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా లో కాజల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ఒక వైపు నాగార్జున ఈ సినిమాను చేస్తూనే మరో వైపు బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే బంగార్రాజు సినిమా షూటింగ్‌ ను ప్రారంభించారు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రవీణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ముగిసిన తర్వాత బంగార్రాజు సినిమాను నాగార్జున పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.