Begin typing your search above and press return to search.

లేటైనా కూడా.. నాగ్ రియక్టయ్యాడు

By:  Tupaki Desk   |   1 Sep 2016 12:51 PM GMT
లేటైనా కూడా.. నాగ్ రియక్టయ్యాడు
X
అక్కినేని నాగర్జునకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చాలానే రిలేషన్ ఉంది.1989లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివ.. వీరిద్దరి కెరీర్ గ్రాఫ్ లను మార్చేసింది ముఖ్యంగా నాగ్ కంటే ఎక్కువగా వర్మ పేరు మార్మోగిపోయేలా చేసిందీ సినిమా. అందుకే తనకు నాగార్జున చాలా స్పెషల్ అన్నాడు వర్మ.

ఆగస్ట్ 29న నాగార్జున బర్త్ డే కావడంతో స్పెషల్ గా ట్వీట్ పెట్టాడు వర్మ. తను ఎవరి బర్త్ డేలు పట్టిచుకోనని.. విషెస్ చెప్పనని.. కానీ తనకు శివ ఛాన్స్ ఇచ్చి దర్శకుడిగా జన్మనిచ్చిన నాగార్జున మాత్రం చాలా స్పెషల్ అంటూ విషెస్ చెప్పాడు వర్మ. అయితే బర్త్ డే రోజున ట్వీట్ చేస్తే.. దానికి అక్కినేని నాగార్జున నుంచి ఆన్సర్ ఇప్పుడొచ్చింది. 'హే రామూ.. ఇప్పుడే నీ ట్వీట్స్ చూశా. నన్ను మాత్రం ఆ లిస్ట్ నుంచి తప్పించినందుకు థ్యాంక్స్. అలాగే నీ శివ కూడా నాకు చాలా స్పెషల్. అది నా లైఫ్ ని మార్చేసింది' అంటూ ట్వీట్ చేశాడు నాగార్జున.

వర్మ ట్వీట్ కి నాగ్ రియాక్షన్ సూపర్ అనాల్సిందే. నిజంగానే శివ తర్వాత నాగ్ కెరీర్ మారిపోయింది. ఆయన కెరీర్ ఒక్కటేంటి.. అసలు తెలుగు సినిమానే మార్చేసిన ఘన చరిత్ర శివ మూవీది.