Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ హోస్టింగ్ పారితోషికాల రేంజ్ ఎంతంటే?
By: Tupaki Desk | 30 July 2020 9:00 AM ISTబిగ్ బాస్ 4 సీజన్ కి సమయమాసన్నమైన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ రియాలిటీ షో ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే ఇంటి సభ్యులు ఫలానా అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. జాబితాలో నలుగురు హీరోలు .. ఒకరిద్దరు కథానాయికలు.. కొందరు వేడెక్కించే యాంకర్లు ఉన్నారన్న ప్రచారం సాగింది. కింగ్ నాగార్జున ఈ కొత్త సీజన్ కి హోస్టింగ్ చేస్తారని తెలుస్తోంది.
అయితే హోస్ట్ సహా ఇంటి సభ్యులు ఎవరెవరు? అన్నది స్టార్ మా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే హోస్ట్ కి పారితోషికం ఎలా ఉంటుంది? అన్నదానిపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి. గత మూడు సీజన్లకు వరుసగా ఎన్టీఆర్ - నాని- నాగార్జున హోస్టింగ్ చేసారు. స్టార్ డమ్ రేంజును బట్టి పారితోషికాలు అందుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ కి రూ.50లక్షలు అందుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానీ ఒక్కో ఎపిసోడ్ కి రూ.10లక్షలు అందుకున్నారని ప్రచారమైంది. అలాగే మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్. ఆ ఇద్దరితో పోలిస్తే మిడ్ రేంజులో పారితోషికం అందుకున్నారు. ఈసారి నాలుగో సీజన్ కి నాగార్జుననే హోస్ట్. ఇంతకుముందు టోటల్ సీజన్ కి ఇంత అని అందుకున్నారట. ఈసారి మాత్రం అలా కాదు. ఒక్కో ఎపిసోడ్ కి ప్యాకేజీ అందుకోబోతున్నారట. గత సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన కింగ్ కి స్టార్ మా వాళ్లు ఈసారి ఎపిసోడ్ వారీగా భారీ ప్యాకేజీనే ముట్టజెప్పనున్నారట. ఇప్పుడున్న సన్నివేశంలో నాగార్జున అయితేనే బెస్ట్ అని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారని సమాచారం. బిగ్ బాస్ 3లో కొన్ని ఎపిసోడ్లకు రమ్యకృష్ణను బరిలో దించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రయోగాలు ఈసారి చేస్తారా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మహమ్మారీ విజృంభణ నేపథ్యంలో బిగ్ బాస్ ఉంటుందా ఉండదా? అన్నదానికి చెక్ పెట్టేస్తూ ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.