Begin typing your search above and press return to search.

రాజు గారి గదికి మబ్బులు వీడాయ్

By:  Tupaki Desk   |   25 July 2017 5:06 AM GMT
రాజు గారి గదికి మబ్బులు వీడాయ్
X
ఆగష్టు నెల నుండి తెలుగులో వరసపెట్టి స్టార్ హీరోలు ఒక్కో వారం ఒక్కకరు వచ్చి సందడి చేయనున్నారు. ఆగష్టు నెలలో రానా, నితిన్ లాంటి హీరోలు రాబోతుంటే దసరాకు మహేశ్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ రాబోతున్నారు. ఇప్పుడు అక్టోబర్ మాసంలో కూడా అదే సందడి ఉండబోతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే రాజు గారి గది 2 సినిమా రెడీ అయిపోయింది కాబట్టి.. నాగార్జున కూడా రేస్ లోకి వచ్చేస్తాడట.

రాజు గారి గది2 లాంటి సిక్వల్ సినిమాను నాగార్జున చేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున నటన కానీ తన పాత్ర నైజం కానీ ఇంతకు ముందు సినిమాలు కంటే భిన్నంగా ఉండబోతుంది అని డైరెక్టర్ ఓంకార్ చెప్పాడు. ఈ సినిమాలో తారాగణం కూడ ఇప్పుడు ఆసక్తిగా మారింది. సమంత రాజు గారి గది2 లో ఒక ప్రధాన పాత్రలో అదీనూ ఒక గోస్ట్ గా నటించబోతుంది. సీరాత్ కపూర్ -అశ్విన్ - వెన్నెల కిశోర్ మరో ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయినా కూడా.. నాగార్జునకు సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ నచ్చకపోవడంతో ఇన్నాళ్ళూ చాలా డిలే అయ్యిందని.. అలాగే రీషూట్స్ కారణంగా కూడా చాలా డీలే అయ్యిందనే టాక్. ఇంతకీ ఇప్పుడు ఈ సినిమాలో ఏం జరుగుతోంది?

రాజు గారి గది 2 సినిమా షూటింగ్ చివరి దశలో ఉందట. అక్టోబర్ 13 నాడు రాజు గారి గది2 విడుదల చేయడానికి ఒక తేది ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తమాషా ఏంటంటే రాజు గారి గది మొదటి భాగం కూడా కిందట ఏడాది అక్టోబర్ 13 నే విడుదలై మంచి విజయం పొందింది. ఇప్పుడు రాజు గారి గది2 కూడా అలాంటి విజయమే పొందుతుంది అని ఆశాభావంతో ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారేమో. ఫైనల్ గా మబ్బులు వీడి సినిమా రిలీజై.. అది నాగ్ కు మాంచి హిట్టివ్వాలని.. ఓంకార్ కు పెద్ద బ్రేక్ ఇవ్వాలని అందరూ ఆశిస్తున్నారు.