Begin typing your search above and press return to search.

బ్యాచిలర్ కోసం నాగ్‌ కత్తెర?

By:  Tupaki Desk   |   2 Oct 2021 1:07 PM IST
బ్యాచిలర్ కోసం నాగ్‌ కత్తెర?
X
రెండు వారాల్లో అక్కినేని అఖిల్ మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా సందర్బంగా విడుదల కాబోతున్న మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా విడుదల చాలా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాదిలో ఉంటుందా లేదా అనే అనుమానాల నడుమ దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అఖిల్ గత చిత్రాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చిన నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. నాగార్జున ఇంకా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాపై ఒకటికి రెండు అన్నట్లుగా మరింత శ్రద్దను కనబర్చుతున్నారు. అందుకే కథ మొదలుకుని అన్ని విషయాల్లో నాగార్జున కొంతలో కొంత అయినా ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉందట. తన అనుభవంతో చిన్న చిన్న లీడ్స్ ఇవ్వడం మొదలుకుని అన్ని విషయాల్లో కూడా ఆయన సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

షూటింగ్‌ విషయంలో కూడా కొన్ని అసంతృప్తులు ఉండటంతో రీ షూట్ కు వెళ్లారని.. కొన్ని సన్నివేశాల విషయంలో మేకర్స్‌ చాలా పట్టుదలతో వ్యవహరించారని వాటిని మళ్లీ మళ్లీ రీషూట్ చేసి మరీ పైనల్ వర్షన్ కు వచ్చారని టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.. డేట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ నాగార్జున నుండి చిన్న చిన్న మార్పులు వచ్చాయట. అవి ఎడిటింగ్‌ మార్పులు అవ్వడంతో వాటిని చేసేందుకు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. నాగార్జున కత్తెర పట్టిన సినిమాలు గతంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఒక ప్రేక్షకుడిగా నాగార్జున మంచి జడ్జిమెంట్‌ ఉంటుంది. అందుకే ఆయన నిర్ణయాన్ని అల్లు అరవింద్‌ కూడా కాదనకుండా ఆ కొన్ని సన్నివేశాల రీ ఎడిట్ కు ఓకే చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాలో అఖిల్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా ఇంకా ఈషా రెబ్బాలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఒక వైవిధ్యభరిత లవ్‌ స్టోరీతో ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్‌ 15న దసరా కానుకగా విడుదల కాబోతుంది. దసరాకు చిన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. కాని మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కు మాత్రం మంచి బజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం కూడా వ్యక్తం అవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.