Begin typing your search above and press return to search.

ఏజెంట్ కోసం నాగార్జున పూజలు ఫలించలేదా..?

By:  Tupaki Desk   |   28 April 2023 2:00 PM GMT
ఏజెంట్ కోసం నాగార్జున పూజలు ఫలించలేదా..?
X
అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఏజెంట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించారు. సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం కాగా తను తీసిన ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ నే ఈ సినిమాకు రిపీట్ చేశాడు సురేందర్ రెడ్డి. స్పై యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు.

తనయుడు సినిమా రిలీజ్ టైం లో అతను ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం వల్ల నాగార్జున విత్ అమల తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్నారు. గురువారం తిరుమలలో నాగార్జున అమల సందడి చేశారు. వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

అఖిల్ మొదటి సినిమా నుంచి మిస్టర్ మజ్ను, హలో వరకు నాగార్జున బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా ఉన్నారు. కానీ అఖిల్ అలా వర్క్ అవుట్ అవ్వట్లేదని సొంతంగా కథల వేట మొదలు పెట్టాడు. ఆ క్రమంలో బ్యాచిలర్ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇదే పంథాలో సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఏజెంట్ చేశాడు.

అఖిల్ ఏజెంట్ సినిమాలో నాగార్జున వేలు పెట్టడం కాదు కదా కనీసం షూటింగ్ టైం లో తొంగి కూడా చూడలేదు. సినిమా కొన్నిసార్లు రీ షూట్స్ చేస్తున్నా అఖిల్ మీదే అంతా భారం వేశారు. అఖిల్ కూడా తన సొంత టాలెంట్ తో సినిమా హిట్ కొట్టాలని అనుకున్నాడు.

అయితే మొదటి షో పూర్తి కాగా అఖిల్ పై మిక్సెడ్ టాక్ వస్తుంది. సినిమాలో యాక్షన్ పార్ట్ బాగానే ఉన్నా కథ కథనాల్లో దమ్ము లేదని అంటున్నారు. హీరో క్యారెక్టర్ మీద సినిమా నడిపిద్దాం అనుకున్న డైరెక్టర్ సినిమాను కలగాపులగం చేసినట్టు టాక్ వచ్చింది.

సో అఖిల్ కోసం నాగార్జున చేసిన పూజలు తగిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పొచ్చు. అఖిల్ మాత్రం ఏజెంట్ తో తనకు మాస్ హిట్ పక్కా అనేట్టుగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాతో సత్తా చాటుతాడని అనుకోగా డైరెక్షన్ ఫెయిల్యూర్ అనిపించుకున్నాడు.