Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ షోకు నాగ్ కు వచ్చేదెంత?

By:  Tupaki Desk   |   7 Sep 2021 3:47 AM GMT
బిగ్ బాస్ షోకు నాగ్ కు వచ్చేదెంత?
X
గడిచిన కొద్ది నెలలుగా బిగ్ బాస్ 5 సీజన్ గురించి వార్తలు పెద్ద ఎత్తున మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్ కు ఎంపికయ్యే వారెవరు? దానికి సంబంధించిన కసరత్తుపైనా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ సస్పెన్స్ తీరిపోవటం.. ఐదో సీజన్ ను గ్రాండ్ గా షురూ చేయటం తెలిసిందే. గతానికి భిన్నంగా 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ 5కు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈసారి సీజన్ కు కింగ్ నాగార్జునకు ఇవ్వనున్న రెమ్యునరేషన్ ఎంత? అన్నది ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి నాగ్ రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది. గత సీజన్ కు ఈసారి సీజన్ కు రెమ్యునరేషన్ విషయంలో పొంతన లేదని చెబుతున్నారు. గత సీజన్ లో తాను కనిపించే ఎపిసోడ్ కు రూ.12లక్షల చొప్పున ఛార్జ్ చేసే వారని.. ఈసారి అందుకు భిన్నంగా సీజన్ మొత్తానికి కలిపి ఏకంగా రూ.12 కోట్లు ఇచ్చేందుకు స్టార్ మా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. వారానికి రెండు రోజులు కనిపించటం తెలిసిందే. మొత్తంగా 106 రోజుల పాటు సాగే ఈ షో కోసం ఈసారి భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

షో నిర్వహణకు నాగార్జునకు రూ.12 కోట్లు లభిస్తుంటే.. షో మొత్తానికి వేదిక అయిన అన్నపూర్ణ స్టూడియో కూడా నాగ్ దే అన్న విషయం తెలిసిందే. ఈ షో కోసం భారీ సెట్ వేయటం.. అందుకోసం ఏకంగా వారాల తరబడి నిర్మాణం చేయటం.. 15 వారాలు షో జరిగే నేపథ్యంలో భారీగా ఛార్జి వేసే వీలుందని.. ఈ ఆదాయం కూడా నాగ్ కుటుంబం ఖాతాలోకే వెళుతుందన్నది మర్చిపోకూడదు.. బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు పలువురు షో నిర్వహించినా.. నాగ్ తనదైన శైలిలోఅలరించటంతో.. బిగ్ బాస్ తెలుగు వరకు నాగ్ నే ఫైనల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.