Begin typing your search above and press return to search.

అఖిల్ పై నాగ్ ప్రయోగం చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   7 Dec 2015 11:30 AM GMT
అఖిల్ పై నాగ్ ప్రయోగం చేస్తున్నాడా?
X
నాగ చైతన్య ఇంట్రడక్షన్ చేసిన మిస్టేక్స్ జరక్కుండా.. అఖిల్ ని చాలా హైప్ మధ్య తెలుగు తెరకు పరిచయం చేశాడు నాగ్. అయితే ప్రచారం ఎక్కువయిపోవడం, అంచనాలను రీచ్ కాకపోవడం, అసలు థీమ్ వదిలేసి సినిమా పక్కదారులు పట్టడంతో ఆశించిన రిజల్ట్ అందకోలేకపోయింది అఖిల్ మూవీ.

మొదటి మూవీ ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే కోలుకున్నాడు నాగ్. సినిమా సంగతేమో కానీ అఖిల్ పెర్ఫామెన్స్ మాత్రం సంతృప్తి ఇచ్చిందని ఇప్పటికే చెప్పిన నాగార్జున.. ఇప్పుడు ఈ కుర్ర హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. సెకండ్ మూవీ కోసం ఇప్పటికే పలువురు డైరెక్టర్లతో సంప్రదింపులు కూడా చేస్తున్నాడు. క్రిష్ - దేవ్ కట్టా - త్రివిక్రమ్ లతోపాటు మనం లాంటి మూవీని అందించిన విక్రం కుమార్ లను కూడా పరిశీలిస్తున్నాడు. మంచి స్టోరీ సిద్ధం చేయాలంటూ సూచించాడట కూడా. వీళ్లతో పాటు ఇప్పుడు పూరీ జగన్నాధ్ తో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడు నాగ్. క్లాస్ - మాస్ లకు రీచ్ కావాలంటే పూరీనే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వరుణ్ తేజ్ తో లోఫర్ తీస్తున్న పూరీ.. మరో రెండు ప్రాజెక్టులు కూడా చేయాల్సి ఉంది. వీటి రిజల్ట్ ను బట్టి డెసిషన్ తీసుకోనున్నాడట.

అంతా బాగానే ఉంది కానీ.. ఇన్ని ప్రయోగాలు చేసే బదులు.. స్ట్రయిట్ గా మాస్ మసాలా చేసేయచ్చు కదా అనే సలహాలు వినిపిస్తున్నాయి. ఎలాగూ అఖిల్ తో రెండో మూవీ చేయాలని భావిస్తున్న కామాక్షి మూవీస్ కి ఇదే ఇమేజ్ ఉంది.. అఖిల్ కూడా ఫైట్స్ - డ్యాన్స్ లలో కుమ్మేస్తున్నాడు. వీటన్నిటి బట్టి చూసుకుంటే అనవసర ప్రయోగాలకు బదులుగా నేరుగా ఫ్యాన్స్ కి కావాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది అంటున్నారు. మరి నాగ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో.