Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్ 100 చూసి నాగార్జున ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   2 Aug 2018 11:30 AM GMT
ఆర్ ఎక్స్ 100 చూసి నాగార్జున ఏమన్నాడంటే..
X
అప్పట్లో అర్జున్ రెడ్డి మూవీ విడుదలై ఎంత సెన్షేషన్ సృష్టించిందో ఇప్పుడు ఆర్ ఎక్స్100 కూడా అదే బజ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రోమాన్స్ శృతిమించిందని సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు.. సినీ ప్రముఖులు - యువత మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు.. కొత్త ఒక వింత అని దాన్ని అన్వయించుకోవాలని చిత్రం యూనిట్ చెబుతోంది. ఇలా రకరకాల విమర్శలు వచ్చినా కూడా ‘ఆర్ ఎక్స్100 మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఇటీవల ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూడా ఆర్ ఎక్స్ మూవీ చూసి తప్పుపడుతూ విమర్శలు చేసింది. ఇలాంటి తరుణంలో కింగ్ నాగార్జున ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.

‘ఆర్ ఎక్స్ 100’ మేనియా గురించి విని అన్నపూర్ణ స్టూడియోలోని డిఐ ల్యాబ్ లో ఈ సినిమా చివరి రెండు రీళ్లు చూడమంటే చూశాను. ఆ రెండు రీళ్లలో సినిమా అదిరిపోయింది. చాలా బాగా తీశారు. రైటింగ్ తో పాటు ఆర్టిస్టుల పర్ ఫామెన్స్ సూపర్ ’ అని నాగార్జున మెచ్చుకున్నారు. అంతేకాదు.. ఈ బిట్స్ చూశాక సినిమా మొత్తం చూడాలన్న కుతూహలం తనకు కలిగిందని.. త్వరలోనే చూస్తానని నాగ్ అన్నాడు.

కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించాలని.. సినిమాకు వచ్చిన ‘ఏ’ రేటింగ్ ను బట్టి చూడాలా .? వద్దా? అన్నది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలని నాగార్జున సూచించారు.