Begin typing your search above and press return to search.

ఇంకో నాగార్జున వెనక్కి తగ్గాడు

By:  Tupaki Desk   |   21 Dec 2015 4:51 AM GMT
ఇంకో నాగార్జున వెనక్కి తగ్గాడు
X
ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అక్కినేని నాగార్జున. మొన్నటి దాకా ఈ సినిమా సంక్రాంతి విడుదల విషయంలో కొంచెం డౌట్లుండేవి కానీ.. ఇప్పుడా సందేహాలన్నీతీర్చేస్తూ పొంగల్ రేసులోకి దూసుకొస్తున్నాడు మన్మథుడు. ఐతే నాగ్ మరో సినిమా ‘ఊపిరి’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని సాధ్యమైనంత త్వరగా థియేటర్లలోకి దిగిపోవాలన్న ఉత్సాహంతో ఉంది. ఈ సినిమాన మొదట ఫిబ్రవరి 5న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ప్లానింగ్ కూడా జరిగింది.

ఐతే ‘మనం’ తర్వాత అభిమానుల్ని దాదాపు 20 నెలలు వెయిట్ చేయిస్తున్న నాగ్.. మరీ 20 రోజుల వ్యవధిలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తే ఏం బావుంటుంది? మళ్లీ ఇంకో సినిమా మొదలుపెట్టి దాన్ని రిలీజ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ‘ఊపిరి’ని ఫిబ్రవరిలో కాకుండా వేసవికి విడుదల చేయాలని ఫిక్సయ్యారట ఇప్పుడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నాగ్ సొంత సినిమా కావడంతో దాని కోసం ‘ఊపిరి’ని వెనక్కి తీసుకెళ్తున్నారు. నాగ్ ద్విపాత్రాభినయం చేసిన ‘సోగ్గాడే..’ జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారుు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఊపిరి’లో కార్తి - తమన్నా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొట్లూరి వరప్రసాద్ నిర్మాత.