Begin typing your search above and press return to search.

హీరోలకు నాగ్ టెన్షన్!

By:  Tupaki Desk   |   3 March 2016 7:30 AM GMT
హీరోలకు నాగ్ టెన్షన్!
X
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున త్వరలో 'ఊపిరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగార్జున చేస్తున్న సినిమాలని చూస్తుంటే ఆయనపై ఉన్న అభిమానం ప్రేక్షకుల్లో రెట్టింపు అయిందని చెప్పాలి. అయితే ఎప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ సినిమాల స్థాయిని పెంచుతూ వస్తున్న నాగార్జున ఊపిరిలో కేవలం వీల్ చైర్ పై నటించి మెప్పిస్తాడట. కాళ్ళు, చేతులు పడిపోయినా.. మనసు మాత్రం పరిగెడుతూనే ఉంటుందని స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. మూస పద్దతిలో వెళ్తున్న స్టార్ హీరోలకి షాక్ ఇస్తూ ప్రయోగాలకు పట్టం కడుతున్నాడు. సినిమా అంటేనే మనసుని గెలవడం.

అటువంటి నటనతో అశేష ప్రేక్షాదరణ పొందుతూ.. వస్తున్న నాగర్జున బుల్లితెర ప్రేక్షకులని కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాతో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా తన స్టార్ డమ్ ని పక్కకు పెట్టి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమాతో మనలో ఒకడిగా ఉన్నారు నాగార్జున. సినిమా సినిమాకి ప్రయోగాలూ చేస్తూ, సినిమాలని వరుసగా హిట్ చేసుకుంటున్న నాగార్జున 'ఊపిరి'తో మరో హిట్ అందుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాభైలలో కూడా ఇలా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నాగార్జున సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు కూడా మంచి కాంపిటిటర్ అనే చెప్పాలి. మరి సూపర్ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తున్న నాగ్ ఇంకా తెలుగు ప్రేక్షకుల కోసం మరికెన్ని సర్ ప్రైజ్ లు ఇస్తారో చూడాలి.