Begin typing your search above and press return to search.

అది సవ్యసాచి మీద నమ్మకమే!

By:  Tupaki Desk   |   1 Nov 2018 7:16 PM IST
అది సవ్యసాచి మీద నమ్మకమే!
X
రేపు విడుదల కానున్న సవ్యసాచి ఫలితంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో చైతు ఇదివరకు చేయని ఒక సరికొత్త పాత్రలో కనిపించనుండగా మాధవన్ మొదటిసారి తెలుగు తెరపై విలన్ గా చేయటం మరో ఆకర్షణగా నిలుస్తోంది. తనతో పాటు కొడుకుల సినిమాల రషెస్ ఎడిటింగ్ ప్రమోషన్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించే నాగార్జున సవ్యసాచి గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించలేదు. ఆ మధ్య శైలజారెడ్డి అల్లుడు ఫంక్షన్ లో సవ్యసాచి లైన్ మాత్రమే విన్నానని అంతకు మించి తనకేమి తెలియదని చెప్పి సబ్జెక్టు మీద ఎంత నమ్మకమో చెప్పకనే చెప్పాడు.

దానికి తగ్గట్టే దీన్ని ప్రమోట్ చేసుకునే బాధ్యతను పూర్తిగా చైతు టీమ్ కే వదిలేసాడు. నాగ్ కున్న కాన్ఫిడెన్స్ వల్లే రేపు రిజల్ట్ ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని ఫ్యాన్స్ భరోసాతో ఉన్నారు. నాగ చైతన్యకు సైతం ఈ సక్సెస్ చాలా కీలకం. దర్శకుడు చందు మొండేటి ట్రాక్ రికార్డుతో పాటు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ ను బాగా డీల్ చేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉండటం కూడా ప్లస్ గా మారుతోంది. ట్రైలర్ తో పాటు ఆడియో సక్సెస్ కావడం అభిమానులు శుభశకునంగా ఫీలవుతున్నారు. భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీతో నిధి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఎడమ చేయి తన ఆధీనంలో ఉండని సరికొత్త పాత్ర చేస్తున్న చైతుకి ఇది కనక హిట్ అయితే రిలీఫ్ దొరికేస్తుంది. గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో దీని మీద గట్టి గురే ఉంది.