Begin typing your search above and press return to search.

ఇప్పుడు నాగ్ ఒక ఇన్ స్పిరేషన్

By:  Tupaki Desk   |   7 May 2017 4:24 AM GMT
ఇప్పుడు నాగ్ ఒక ఇన్ స్పిరేషన్
X
తన సినిమాకు కూడా అంతాగా ఇంటర్వ్యూలు కానీ ప్రెస్ మీట్స్ కానీ పెట్టని నాగ్ ఇప్పుడు నాగ చైతన్య కొత్త సినిమా కోసం నానా హంగామా చేస్తున్నారు. ఒక పి‌ఆర్‌ఓ లా పని చేస్తున్నారు. మంచి సినిమాని ఎప్పుడు ఎలా మార్కెట్ చేయాలో తెలిసిన నాగార్జున ఇప్పుడు తన కొడుకు మూవీ కోసం చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి.

కళ్యాణ్‌ కృష్ణ డైరక్షన్లో వస్తున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులున్నీ ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. తన ఫాన్స్ కి నాగ చైతన్య ఫాన్స్ కి ఎప్పటికిప్పుడు ఈ మూవీ విశేషాల గురించి స్వయంగా నాగ్ అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాగ్ పబ్లిసిటీ బాధ్యత మొత్తం తను తీసుకున్నారుని చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను కొట్టిపారేస్తూ మూవీ డేట్స్ గురించి స్పష్టంగా చెప్పారు. రా రాండోయి వేడుక చూద్దాం సినిమా మే 26న విడుదల చేస్తాం అని ఖచ్చితంగా చెప్పారు. మే 6న సినిమా ఫస్ట్ లుక్ ని ఆదివారం టీజర్ని విడుదల చేస్తాం అని కూడా ఆయనే తెలిపారు.

సర్లేండి.. ఒక నిర్మాతగా అందరూ ఇదే విధంగా బిహేవ్ చేస్తే.. సినిమాల రేంజ్ ఎక్కడో ఉంటుంది. అంతేకాకుండా.. సినిమా తీసేశాం.. ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేసేశాం.. ఇక మిగిలింది మీరు చూసుకోండి అన్నట్లు కూర్చుంటే ఎలా. నిర్మాతలందరికీ ఇప్పుడు నాగ్ ఒక ఇనిస్పిరేషన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/