Begin typing your search above and press return to search.

నాగ్ నోట ‘రాజుగారి గది-2’ ముచ్చట్లు

By:  Tupaki Desk   |   27 Nov 2016 5:30 PM GMT
నాగ్ నోట ‘రాజుగారి గది-2’ ముచ్చట్లు
X
మొత్తానికి అక్కినేని నాగార్జున మరో సంచలనానికి తెర తీశాడు. దర్శకుల స్థాయి చూడకుండా.. కథ గురించి మాత్రమే ఆలోచిస్తూ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున.. యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘రాజు గారి గది-2’ ఆదివారమే మొదలైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవంలో నాగార్జునతో పాటు దర్శకుడు ఓంకార్.. నిర్మాత పీవీపీ.. ముఖ్య అతిథి కె.రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘రాజు గారి గది-2’లో తనది గెస్ట్ రోల్ కాదని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో తనే హీరో అన్నాడు.

“రాజు గారి గది-2కి హీరోని నేనే. ఇదొక సరికొత్త కథాంశంతో తెరకెక్కబోతున్న సినిమా. మైండ్ గేమ్ ఆడుతూ సాగే ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించనుండడం చాలా కొత్తగా అనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’లో నటిస్తున్నా. ఇంకో మూడు నాలుగు వారాల్లో ‘రాజుగారి గది-2’కు సంబంధించి నా లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓంకార్ నా లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. కొత్త కొత్త జానర్లలో సినిమాలు చేయడం నాకిష్టం. అందుకే రాజుగారి గది-2 ఒప్పుకున్నా’’ అని నాగార్జున తెలిపాడు. మరోవైపు దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. ‘‘రాజు గారి గది-2 అని టైటిల్ పెట్టాం కానీ.. ఇదొక కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా. నాగార్జున గారు ఫుల్ లెంగ్త్ హీరోగానే కనిపిస్తారు’’ అని చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/