Begin typing your search above and press return to search.

చైతూని నాగార్జున ఆ విష‌యంలో ముందే హెచ్చ‌రించార‌ట‌!

By:  Tupaki Desk   |   15 Sep 2022 3:48 PM GMT
చైతూని నాగార్జున ఆ విష‌యంలో ముందే హెచ్చ‌రించార‌ట‌!
X
ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ `బ్ర‌హ్మాస్త్ర‌`. అయాన్ ముఖ‌ర్జీ రూపొందించిన ఈ మూవీలో నంది అస్త్ర‌గా కీల‌క అతిథి పాత్ర‌లో కింగ్ నాగార్జున న‌టించిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీ బాయ్ కాట్ ట్రెండ్ ని అధిగ‌మించిన సెప్టెంబ‌ర్ 9న విడేద‌లై ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకి మిశ్ర‌మ స్పంద‌న‌ని సొంతం చేసుకుంది. అయినా స‌రే ముందు నుంచి పాజిటివ్ టాక్ వుండ‌టంతో భారీ ఓపెనింగ్స్ ని రాబ‌ట్టింది. దీంతో మేక‌ర్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఈ సంద‌ర్బంగా జాతీయ మీడియాతో ప్ర‌త్యేకంగా ముట్టించిన కింగ్ నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

`బ్ర‌హ్మాస్త్ర‌` కు మిశ్ర‌మ స్పంద‌న‌, చైతూ న‌టించిన `లాల్ సింగ్ చ‌డ్డా` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావడంపై కుటుంబ స‌భ్యులు ఎలా ఫీల‌య్యార‌ని అడిగితే `ఇది ఒక చేదు తీపి జ్ఞాప‌కం అన్నారు. న‌లుగురు స్టార్ లు వున్న మా ఫ్యామిలీలో ఇలా ప్ర‌తీ ఏడాది జ‌రుగుతూనే వుంటుంద‌న్నారు. ఇక `బ్ర‌హ్మాస్త్ర` రిలీజ్ రోజునే చాలా రోజుల విరామం త‌రువాత అమ‌ల న‌టించిన `ఒకే ఒక జీవితం` కూడా విడుద‌లైంద‌ని, టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ విజ‌యాన్ని సాధించ‌డం మా ఇంట్లో వాళ్లంద‌రికి ఆనందాన్ని క‌లిగించింద‌ని తెలిపారు నాగార్జున‌.

ఇదే సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య ప‌రిచ‌య‌మైన `లాల్ సింగ్ చ‌డ్డా` గురించి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఈ మూవీలో అమీర్ ఖాన్ హీరోగా టైటిల్ పాత్ర‌లో న‌టించ‌గా అత‌నికి స్నేహితుడిగా బాల రాజు బోడిగా నాగ‌చైత‌న్య న‌టించాడు. ఆగ‌స్టు 11న భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ అమీర్ ఖాన్ కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ గురించి కింగ్ నాగ్ మాట్లాడుతూ లాల్ సింగ్ చ‌డ్డా చేస్తున్న స‌మ‌యంలోనే ఇది నీకు స్టార్ గా గుర్తింపుని తీసుకురాద‌ని, మంచి న‌టుడిగా మాత్ర‌మే ప్రేక్ష‌కులు నిన్ను గుర్తిస్తార‌ని చైతూని హెచ్చ‌రించాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న రీమేక్ లో న‌టిస్తున్నాన‌ని చైత‌న్య త‌న‌కు చెప్పిన‌ప్పుడే ఈ మూవీతో స్టార్ గా గుర్తింపు ల‌భిస్తుంద‌ని అనుకోవ‌ద్ద‌ని, ఇది నీకు న‌టుడిగా మాత్ర‌మే పేరు తెచ్చిపెడుతుంద‌ని నాగ్ తెలిపార‌ట‌. ఆ విష‌యాన్ని చైతూ కూడా అంగీక‌రించి తాను న‌టుడిగా పేరు తెచ్చుకోవాల‌నే ఈ సినిమా చేస్తున్న‌ట్టు వెల్ల‌డించాడ‌ట‌.

అంతే కాకుండా త‌మ సినిమాలు రిలీజ్ అయిన సంద‌ర్భంలో ఇంట్లో వాతావ‌ర‌ణం ఎలా వుంటుంతో కూడా ఈ సంద‌ర్భంగా వివ‌రించారు నాగార్జున‌. మా సినిమాల రిలీజ్ రోజు మేము అంతా క‌లిసే వుంటాం. ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా క‌లిసి డిన్న‌ర్ చేసి అంద‌రం ఆ మూవీల‌ని ఎంజాయ్ చేస్తాం. మా ఫ్యామిలీకి ప్ర‌తీ సంవ‌త్స‌రం చేదు, తీపి జ్ఞాప‌కాలు వుంటూనే వుంటాయి. అయితే ఇప్ప‌డు ఆరు నెల‌ల‌కోసారి ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాం` అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.