Begin typing your search above and press return to search.

'బ్ర‌హ్మాస్ర్తం' తో కింగ్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి!

By:  Tupaki Desk   |   13 Jun 2022 9:31 AM GMT
బ్ర‌హ్మాస్ర్తం తో కింగ్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి!
X
కింగ్ నాగార్జున బాలీవుడ్ లో సినిమా చేసి చాలా కాల‌మ‌వుతోంది. కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత `బ్ర‌హ్మాస్ర్త‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగ్ తెర‌పైకి క‌నింపించేది కాసేపే అయినా ఉన్నంత సేపు ఆద్యంతం ఆక‌ట్టుకుంటార‌ని అంచ‌నాలున్నాయి. బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్..రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో కింగ్ తెర‌ను పంచుకుంటున్నారు. ఆయాన్ ముఖ‌ర్జీ చిత్రాన్ని భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైగ‌న‌ర్ గా తెర‌కెక్కించారు.

పాన్ ఇండియా కేట‌గిరిలో సినిమా రిలీజ్ అవుతుంది. అందులోనూ తెలుగు రిలీజ్ ప్రతిష్టాత్మ‌కంగా జ‌రుగుతుంది. ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ . ఎస్ రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం..మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండ్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం వంటివి తెలుగు వెర్స‌న్ బ్ర‌హ్మాస్ర్తానికి ఆయువు ప‌ట్టులా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నాగార్జున ఎలాంటి పాత్ర పోషిచారు అన్న‌ది తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

అయితే ఈ సినిమాతో కింగ్ చాలా లెక్క‌లే స‌రిచేయాల్సి ఉంద‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తుంది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. గ‌తంలో నాగ్ గెస్ట్ రోల్ పోషించిన కొన్ని హిందీ స‌హా తెలుగు సినిమా ఫ‌లితాలే ఈ అనుమానాల‌కు తావిస్తున్నాయి. 1992 లో కింగ్ `ఖుదాగ‌వా` లో న‌టించారు. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు.

ఆ త‌ర్వాత `బేచారా` అనే సినిమాలో గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇచ్చారు. అదీ క‌మ‌ర్శియల్ గా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. `బార్డర్` ..`ఎల్ ఓసీ`..`జక్మ్` లాంటి చిత్రాల్లోనూ న‌టించారు. వాటి ఫ‌లితాలు కూడా ఏమంత ఆశాజ‌న‌కంగా లేవు. ఇక తెలుగులో `త‌కిట త‌కిట‌`.. `ఘ‌టోత్క‌చుడు`..`సైజ్ జీరో`..`కృష్ణార్జున‌`..`అధిప‌తి` చిత్రాల్లోనూ న‌టించారు.

అవి బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి వసూళ్లు సాధించాయో తెలిసిందే. ఈ సినిమా ఫ‌లితాలే ఇప్పుడు `బ్ర‌హ్మ‌స్రం` ని కాస్త టెన్ష‌న్ పెడుతున్నాయి. ఆ ఫెయిల్యూర్ సెంటిమెంట్ నాగ్ `బ్ర‌హ్మాస్ర్తం`తో బ్రేక్ చేయాల్సి ఉంది. ప్లాప్ లెక్క‌ల‌న్నింటిని ఈ సినిమా స‌రిచేయాల్సి ఉంద‌న్న టాక్ వినిపిస్తుంది. మ‌రి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా? య‌ధావిధిగా కొన‌సాగిస్తారా? అన్న‌ది సెప్టెంబర్ 9న తేలిపోతుంది.

అలాగే త‌న‌యుడు నాగ‌చైత‌న్య కూడా `లాల్ సింగ్ చ‌ద్దా`లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇది చై కెరీర్ లో తొలి హిందీ చిత్రం. ఆ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇలా తండ్రికుమారులిద్ద‌రు ఒకే ఏడాది హిందీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. ఎలాంటి ఫ‌లితాలు అందుకుంటారో చూద్దాం. ప్రస్తుతం నాగార్జున ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో `ది ఘోస్ట్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.