Begin typing your search above and press return to search.

అఖిల్‌ డేట్‌.. మళ్ళీ మారింది

By:  Tupaki Desk   |   7 April 2016 5:00 PM IST
అఖిల్‌ డేట్‌.. మళ్ళీ మారింది
X
ఉగాది నాడు యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని తన కొత్త సినిమాను ప్రకటిస్తాడని అనుకుంటే.. ఆ డేట్‌మళ్ళీ మారేలా కనిపిస్తోంది. రేపు ఏప్రియల్‌ 8న ఉగాది సందర్బంగా తన రెండో సినిమా డిటైల్స్‌ ఈ కుర్రాడు ప్రకటిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని ఆ ప్రకటన తేదీ మళ్ళీ మారేలా ఉంది.

అయితే ఈసారి కంగారు పడాల్సిందేం లేదు. ఎందుకంటే అఖిల్‌ ఎప్పటిలాగా నెలల తరబడి వెయిటింగ్‌ లిస్టులో పెట్టబోడట. నిజానికి ఏప్రియల్‌ 10న జరుగుతుంది అనుకున్న ''ఊపిరి థ్యాంక్యూ మీట్‌'' డేట్‌ మారిందిప్పుడు. ఎందుకంటే.. 10న సరైనోడు మీట్‌ ఉండటం.. 11న సూర్య 24 ఆడియో రిలీజ్‌.. ఇలా టాలీవుడ్‌ అంతా బిజీగా ఉంది కాబట్టి.. ఏప్రియల్‌ 13న ఊపిరి సినిమా టీమ్‌ మొత్తం ఒక ఫంక్షన్‌ చేస్తోంది. అయితే ఏప్రియల్‌ 8న కాకుండా ఆరోజు గ్రాండ్‌ గా అఖిల్‌ కొత్త సినిమాను వంశీ పైడిపల్లి డైరక్షన్‌ లో చేస్తున్నట్లు ప్రకటిద్దాం అని ఫిక్సయ్యాడట నాగ్‌.

తొలిసినిమా గురించి చెప్పడానికి ఏకంగా 1 సంవత్సరం టైమ్‌ తీసుకున్న అఖిల్‌.. ఇప్పుడు రెండో సినిమా గురించి చెప్పడానికి 6 నెలలు టైమ్‌ తీసుకున్నట్లు. మూడో సినిమా నుండైనా త్వరత్వరగా డెసిషన్లు తీసుకోవయ్యా కుర్ర హీరో.