Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పేలుళ్లపై నాగార్జున ‘వైల్డ్ డాగ్’

By:  Tupaki Desk   |   29 Feb 2020 1:40 PM GMT
హైదరాబాద్ పేలుళ్లపై నాగార్జున ‘వైల్డ్ డాగ్’
X
కొద్దిరోజులుగా హిట్ లేక చతికిలపడ్డ టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున తాజాగా ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. దాని పేరు ‘వైల్డ్ డాగ్’. తాజాగా చేస్తున్న దేశభక్తి చిత్రం షూటింగ్ లో నాగార్జున చాలా బిజీగా ఉన్నారు.

ఈ యాక్షన్ చిత్రానికి సోలమన్ దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు కథ స్ఫూరణ అప్పట్లో ‘లుంబిని పార్క్, గోకుల్ చాట్ లో’ జరిగిన హైదరాబాద్ జంట పేలుళ్లేనని తెలుస్తోంది. జంట పేలుళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథను దర్శకుడు రాసుకున్నట్టు సమాచారం.

అందులో భాగంగానే ఇటీవల కొన్ని కీలకమైన ఎపిసోడ్లను లుంబినీ పార్క్ లోని నిజమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. కథకు ఒరిజినాలిటీ కోసం ఇలా చేశారట.. దీంతో ఈ కథ ఏంటనేది అందరికీ తెలిసివచ్చింది.

ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ వర్మగా నటించాడు. దియా మీర్జా, సైయాబీ ఖేర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగర్రాజు’ సినిమాకు కమిట్ అయ్యాడు.