Begin typing your search above and press return to search.

ఆ మాట నాగ్‌ చెబితే ఇంట్లోనూ న‌మ్మ‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   26 July 2019 7:21 AM GMT
ఆ మాట నాగ్‌ చెబితే ఇంట్లోనూ న‌మ్మ‌లేద‌ట‌!
X
అన్నం మొత్తం ఉడికిందా? లేదా? అని చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఒక్క మెతుకు ప‌ట్టుకుంటే అర్థ‌మ‌వుతుంది. తాజాగా బిగ్ బాస్ -3లో ప్ర‌యోక్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున త‌న తొలి ఎపిసోడ్ లోనే ఇర‌గ‌దీయ‌ట‌మే కాదు.. త‌న ఈజ్ తో ఈ షోకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అవుతార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. సీనియార్టీతో పాటు.. సెన్సాఫ్ హ్యుమ‌ర్ ఎక్కువ‌గా ఉండే నాగ్ కు బిగ్ బాస్ లో త‌న పాత్ర‌ను ఇట్టే ఒదిగిపోవ‌టం ఖాయ‌మ‌న్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇప్ప‌టికే అంద‌రి నోటా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సెట్ వైపు వెళ్లిన ప్ర‌తిసారీ.. పాపం.. లోప‌లేం చేస్తున్నారో అని తాను అనుకుంటాన‌ని చెప్పారు నాగ్‌. బిగ్ బాస్ షోలో ఎవ‌రు పాల్గొంటున్నార‌న్న విష‌యం మీకు ముందే తెలుసు క‌దా? అంటే.. బాబోయ్.. నాకు తెలీనే తెలీద‌న్నారు. అదే విష‌యాన్ని ఇంట్లో చెప్పినా వాళ్లెవ‌రూ న‌మ్మ‌లేద‌న్నారు.

తాను షోకు వ‌చ్చే ఐదు నిమిషాల ముందు మాత్ర‌మే బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఇచ్చార‌ని.. అప్పుడే వాళ్ల గురించి తాను తెలుసుకున్న‌ట్లు చెప్పారు. నాగ్ మాట ఇంట్లో వాళ్లే న‌మ్మ‌న‌ప్పుడు.. మిగిలిన జ‌నాలు ఎలా న‌మ్మ‌గ‌ల‌రు?