Begin typing your search above and press return to search.

నాగ్ భక్తి మూవీ టైటిల్ లోగో ఇదే

By:  Tupaki Desk   |   18 July 2016 7:30 AM GMT
నాగ్ భక్తి మూవీ టైటిల్ లోగో ఇదే
X
నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్ర రావు మరోసారి భక్తిరస చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అన్నమయ్య - శ్రీరామదాసు - శిరిడి సాయి చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు కలియుగ దైవం తిరుమల వేంకటేశునికి పరమ భక్తుడైన హథీరాం బాబా ప్రధాన పాత్రతో నాగార్జున - రాఘవేంద్రరావులు సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రానికి 'ఓం నమో వెంకటేశాయ' అనే టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. ఇప్పుడు టైటిల్ తో పాటు టైటిల్ లోగోను కూడా విడుదల చేసింది యూనిట్. పై లోకాల్లో ఉన్న శంఖు చక్రాల మధ్య టైటిల్ ఉన్నట్లుగా లోగోను డిజైన్ చేశారు. వెంకటేశ్వరుడు.. అటు శంఖం - ఇటు చక్రం.. పూర్తిగా సంప్రదాయత కనిపించేలా బోర్డర్ ఈ లోగోలో కనిపిస్తుంది. అన్నింటికంటే మించి.. వెంకటేశ్వరుని పాదపీఠంపై కె.రాఘవేంద్రరావు బి.ఎ. అని రాసుకుని.. ఆయన పాదాల సన్నిధిలో ఉన్నానంటూ.. ఈ దర్శకేంద్రుడు చెప్పకనే చెప్పాడు.

సంపూర్తిగా భక్తిరస చిత్రమైన ఓం నమో వెంకటేశాయ లో.. అనుష్క భక్తురాలిగాను - ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలోను చేస్తుండగా.. అమ్మవారిగా విమలా రామన్ నటిస్తోంది. వెంకటేశ్వరస్వామి పాత్రలో హిందీ సీరియల్స్ లో దేవుడి పాత్రలతో ఆకట్టుకుంటున్న సౌరభ్ రాజ్ జైన్ నటిస్తున్నాడు.