Begin typing your search above and press return to search.

ఆఫీసర్ నాగ్ వచ్చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 April 2018 8:36 AM GMT
ఆఫీసర్ నాగ్ వచ్చేస్తున్నాడు
X
శివతో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త పంధాను పరిచిన రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా ఆఫీసర్ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం విడుదల చేసింది యూనిట్. చాలా కాలం తర్వాత నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద నాగ ఫాన్స్ తో పాటు వర్మ కం బ్యాక్ మూవీగా అతని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 9 సోమవారం ఉదయం 10 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నారు. చాలా సీరియస్ లుక్ తో ఈ మధ్య కాలంలో చూడని కొత్త షేడ్ లో నాగార్జున కనిపించడం ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. తాను మాట తప్పనని ఇందులో నాగార్జునని చాల పవర్ ఫుల్ గా అందరు మెచ్చేలా చూపిస్తానని వర్మ పదే పదే చెప్పడం హైప్ ని పెంచుతోంది.

శివ తర్వాత రామ్ గోపాల్ వర్మతో నాగార్జున మొత్తం నాలుగు సినిమాలకు హీరోగా చేసాడు. శివ హింది రీమేక్ తర్వాత తీసిన అంతం తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ అది కూడా హిందిలో మళ్ళి తీసారు. దాని తర్వాత వచ్చిన గోవిందా గోవిందా కమర్షియల్ గా విజయం సాధించలేదు కాని మ్యూజికల్ గా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఆల్బంగా మిగిలిపోయింది. ఈ లెక్కన ఆఫీసర్ ఈ ఇద్దరికీ ఆరో సినిమా అవుతుంది. నాగ్ కూడా శివ మేజిక్ ఇందులో రిపీట్ అవుతుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. శివ సీక్వెల్ అనుకున్నప్పటికీ స్క్రిప్ట్ పరంగా న్యాయం చేయలేమని గుర్తించి ఆఫీసర్ ను నాగ్ కోసం సిద్ధం చేసాడు వర్మ.

మే 25 రిలీజ్ డేట్ మరోసారి కొత్త పోస్టర్ లో కన్ఫర్మ్ చేసారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్న ఈ మూవీ థ్రిల్లర్ తరహాలో ఉండొచ్చని టాక్. రాజు గారి గది 2 తర్వాత ఏడు నెలల గ్యాప్ తో వస్తున్న కింగ్ నాగార్జున మూవీ కావడంతో ఫాన్స్ కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. శివమణి తర్వాత మళ్ళి ఖాకీ డ్రెస్ లో కనిపిస్తున్న నాగ్ ఎలా ఉంటాడో చూడాలంటే సోమవారం దాకా వెయిట్ చేస్తే సరి