Begin typing your search above and press return to search.

హలో.. గ్రాఫిక్స్ దగ్గరే చిక్కొస్తోంది

By:  Tupaki Desk   |   6 Nov 2017 8:51 AM GMT
హలో.. గ్రాఫిక్స్ దగ్గరే చిక్కొస్తోంది
X
అఖిల్ సినిమాతో మొదటి అడుగులోనే దెబ్బతిన్న అక్కినేని అఖిల్ రెండవ సినిమాకు చాలా కష్టపడుతున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో అయినా మొదటి హిట్ అందుకోవాలని తన స్థాయికి మించిన ప్రతిభను చూపెడుతున్నాడు. ఇక తండ్రి నాగార్జున కూడా కొడుకు సినిమా హిట్ అవ్వాలని తన అనుభవాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారు. హలో సినిమాలో ప్రతి చిన్న విషయం గురించి నాగ్ చాలా చర్చిస్తున్నారట.

అక్కినేని ఫ్యామిలీ కి మనం లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగానే అవుట్ ఫుట్ బాగానే వచ్చిందట కానీ గ్రాఫిక్స్ విషయంలో నాగ్ కాస్త నిరాశ చెందారని తెలుస్తోంది. మొదటి సినిమా 'అఖిల్'లో కూడా ఇదే తరహలో మిస్టేక్ జరిగింది. విఎఫ్ ఎక్స్ వర్క్స్ చాలా డల్ గా రావడంతో ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

కానీ నాగ్ ఈ సినిమా కోసం తానే నిర్మాతగా మారి బడ్జెట్ ని కూడా ఎక్కువ స్థాయిలోనే పెట్టాడట. ఇప్పటికే సినిమా దాదాపు పూర్తి కావోచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడానికి రెడీ అవుతోంది. కానీ సినిమా విఎఫ్ ఎక్స్ విషయంలో నాగ్ మాత్రం సంతోషంగా లేడని తెలుస్తోంది. అలాగైతే డిసెంబర్ 22 రిలీజ్ టార్గెట్ ఎలా అందుకుంటారు? లెటజ్ సీ.