Begin typing your search above and press return to search.

నాగార్జునకు అంత తీరిక ఎక్కడిది...

By:  Tupaki Desk   |   16 March 2015 11:34 AM GMT
నాగార్జునకు అంత తీరిక ఎక్కడిది...
X
మొన్నటివరకు ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' అంటూ తెగ బిజీగా ఉన్నాడు కింగ్‌ నాగార్జున. కాని ఇటు సినిమాల్లో వరుస ఫ్లాపులు రావడంతో అసలు ఎటువంటి సినిమాలు చేస్తే బెటర్‌ అంటూ సందిగ్దంలో పడిపోయాడు. అయితే ''మనం'' సినిమా హిట్టవ్వడంతో ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. వెంటనే తాను ఇలాంటి క్లాస్‌ మూవీస్‌లో నటిస్తేనే బెటర్‌ అని తెలుసుకొని, ''సోగ్గాడే చిన్నినాయనా'' సినిమాను ఓకె చేశాడు. ఇప్పుడిక మనోడి గురించి చాలా రూమర్లు వస్తున్నాయి.

ఒక ప్రక్కన మైసూర్‌లో సోగ్గాడే చిన్నినాయనా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న నాగ్‌, మరో ప్రక్కన త్వరలోనే చెన్నయ్‌లో జరిగే వంశీ పైడిపల్లి మల్టీస్టారర్‌లో పాల్గొనడానికి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడిక సినిమా షూటింగ్‌ గ్యాప్స్‌ మధ్యలో కొన్ని హిట్టయిన తమిళ సినిమాలను తిలకిస్తున్నారట నాగ్‌. అందులో ఆయన ''మైత్రి'' అనే కన్నడ సినిమా చూశారు. పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇందులో హీరో. ఇక ఈ సినిమాను చూశారో లేదో నాగ్‌ ఈ సినిమాను రీమేక్‌ చేస్తున్నాడంటూ రూమర్లు వచ్చేశాయి. వెంటనే స్పందించిన నాగ్‌, సినిమాను చూశాను కాని దానిని రీమేక్‌ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా నాగ్‌కు అంత తీరిక ఎక్కడిది...