Begin typing your search above and press return to search.

వావ్.. నాగ్ తో నిఖిల్ మల్టీ స్టారర్

By:  Tupaki Desk   |   30 Dec 2016 4:31 AM GMT
వావ్.. నాగ్ తో నిఖిల్ మల్టీ స్టారర్
X
యంగ్ హీరో నిఖిల్ ఎంచుకునే సబ్జెక్టులు ఆడియన్స్ కు ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అందుకే నిఖిల్ మూవీ అనగానే ఇండస్ట్రీలోనే కాదు ఆడియన్స్ లో కూడా బజ్ మొదలవుతుంది. సోలో హీరోగానే సాలిడ్ హిట్స్ కొడుతున్న నిఖిల్.. ఇప్పుడు నాగ్ తో కలిసి నటించేందుకు అంగీకరించడం సంచలనం అవుతోంది.

నాగార్జున ప్రధాన పాత్రలో చందూ మొండేటి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుంది. తాను నాగార్జునకు వీరాభిమాని అని చెప్పడంతో పాటు.. ఇప్పటికే నాగచైతన్యకు ప్రేమమ్ లాంటి హిట్ ఇచ్చిన చందూ మొండేటితో సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో పాత్రకు స్కోప్ ఉండగా.. ఈ రోల్ కోసం నిఖిల్ అడగడం.. సైన్ చేసేయడం కూడా జరిగిపోయాయట. తనకు కార్తికేయ లాంటి మూవీతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కావడం.. నాగార్జునతో కలిసి స్క్రీన్ పంచుకోవడం అంటే.. లైఫ్ టైం ఆపర్చునిటీ అని భావించడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట నిఖిల్.

మార్చ్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఊపిరి మూవీలో కార్తితో కలిసి మల్టీస్టారర్ చేసిన నాగ్.. మరోసారి యంగ్ హీరోతో కలిసి నటించేందుకు అంగీకరించడం విశేషమే. అలాగే నిఖిల్ కూడా మాంచి ఫాం లో ఉండగా భలే స్టెప్పులు వేస్తున్నాడులే.