Begin typing your search above and press return to search.

వైర‌ల్ అవుతున్న నాగార్జున న‌యాలుక్

By:  Tupaki Desk   |   13 Jan 2022 7:30 AM GMT
వైర‌ల్ అవుతున్న నాగార్జున న‌యాలుక్
X
ఈ మ‌ధ్య మ‌న సినీయ‌ర్ హీరోల‌తో పాటు ఈ త‌రం స్టార్స్ కూడా వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై వుండ‌గానే వ‌రుస‌గా సినిమాల్ని లైన్ లో పెట్టేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి నేచుర‌ల్ స్టార్ వ‌ర‌కు ప్ర‌తీ హీరో ప‌రిస్థితి ఇలాగే వుంది. మ‌రి కింగ్ నాగ్ మాత్రం ఊరికే వుంటారా... ఆయ‌న కూడా స్పీడు పెంచేశారు. `బంగార్రాజు`తో జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న నాగార్జున మ‌రో క్రేజీ చిత్రాన్ని ట్రాక్ లో పెట్టారు.

`బంగార్రాజు` థియేట‌ర్ల‌లో సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతుండ‌టంతో నాగ్ త‌న త‌దుప‌రి చిత్రానికి రెడీ అయిపోయారు. కెరీర్‌లో తొలిసారి `రాజు గారి గ‌ది -2` మూవీతో తొలి థ్రిల్ల‌ర్ లో న‌టించిన నాగార్జున తాజాగా ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో `ది ఘోస్ట్‌` పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. అయితే ఇది హార‌ర్ థ్రిల్ల‌ర్ మాత్రం కాదండోయ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఇందులో కింగ్ నాగ్ కు జోడీగా సొనాల్ చౌహాన్ న‌టిస్తోంది. ముందు ఈ పాత్ర కోసం కాజ‌ల్ అగ‌ర్వాల్ ని అనుకున్నారు కానీ ఆమె ప్రెగ్నెంట్ కావ‌డంతో అమ‌లాపాల్‌, మెహ్రీన్ లు భారీగా డిమాండ్ చేయ‌డంతో చివ‌రికి సొనాల్ చౌహాన్ ని ఫైన‌ల్ చేశారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ పై నారాయ‌ణ్ దాస్‌ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ దశ‌లో వుంది. ఇప్ప‌టికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున క‌త్తిప‌ట్టుకుని క్లీన్ షేవ్ తో హ‌త్య‌లు చేస్తూ క‌నిపిస్తాడు.

కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నాగార్జున స‌రికొత్త గెట‌ప్ లో మునుపెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త మేకోవ‌ర్ తో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. రిటైర్డ్ రా ఏజెంట్ గా నాగ్ న‌టిస్తున్న ఈ మూవీలో ఆయ‌న పాత్ర ఇదేనంటూ గుబురు మీసాలు, గడ్డంతో క‌నిపిస్తున్న నాగార్జున స్టిల్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ వెల్ల‌డించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.