Begin typing your search above and press return to search.

కుర్ర డైరక్టర్ తో అక్కినేని మూవీ

By:  Tupaki Desk   |   16 July 2017 8:09 AM GMT
కుర్ర డైరక్టర్ తో అక్కినేని మూవీ
X

అక్కినేని నాగార్జున సినిమాలు చేయడంలో మహా స్పీడ్ చూపించేస్తుంటారు. ఒక సినిమా పూర్తయ్యే సమయానికి.. మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టేయడం.. ఒక్కోసారి ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండడం కూడా నాగ్ కు అలవాటే. ఈ ఏడాది ఇప్పటికే ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని విడుదల చేసిన నాగార్జున.. రాజు గారి గది2 మూవీని రిలీజ్ కి సిద్ధం చేసేస్తున్నారు కూడా.

అయితే.. ఆ తర్వాత నాగ్ చేయబోయే సినిమా ఏదనే విషయం ఇప్పటివరకూ ఫైనల్ కాలేదు. కొన్ని నెలలుగా తన ఇద్దరు కుమారుల కెరీర్ పై ఫుల్లుగా కాన్సంట్రేట్ చేసిన నాగ్.. తన సినిమా విషయంలో కొంత జాప్యం చేశారు. అయితే.. ఇప్పుడు నాగార్జున కొత్త సినిమా ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. తన బ్యానర్ లోనే సినిమా తీసిన ఓ యంగ్ డైరెక్టర్.. ఈ మధ్యనే నాగ్ కు ఓ స్టోరీ వినిపించాడట. ఆ కథ నాగార్జునకు బాగా నచ్చడంతో.. తప్పకుండా సినిమా చేద్దామని అన్నారట. రాజు గారి గది2 రిలీజ్ కాగానే ఈ మూవీ స్టార్ట్ చేద్దామని చెప్పినట్లు కూడా తెలుస్తోంది.

ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేసేయమని చెప్పడంతో.. ఈ ప్రాజెక్టు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లోనే బంగార్రాజు మూవీ చేయాల్సి ఉంది కానీ.. ఆ దర్శకుడు చెప్పిన స్టోరీ నాగార్జునకు సంతృప్తి ఇవ్వకపోవడంతోనే.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగ్ మరుసటి మూవీ ఖాయమే కానీ.. ఆ దర్శకుడు ఎవరనే విషయం మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.