Begin typing your search above and press return to search.
నాగ్ బాగానే నేర్పుతున్నారు
By: Tupaki Desk | 1 Jun 2018 5:00 AM ISTఅక్కినేని నాగార్జున ఇప్పుడు ఆఫీసర్ అంటూ థియేటర్లలోకి వస్తున్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెల్లారేసరికల్లా స్క్రీన్స్ పై సందడి చేయనుంది. ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నాగ్ బాగానే కష్టపడుతున్నారు.. తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
అయితే.. తాను ఎవరికీ ఎలాంటి సలహాలు.. సందేశాలు ఇవ్వబోనంటున్న నాగార్జున.. తన పిల్లలకే ఇలా ఉండాలని ఏనాడూ చెప్పలేదని.. ఇక వర్మకు ఎందుకు చెబుతానని అంటున్నారు. అయితే.. తన అనుభవంతో నేర్చుకున్న పాఠాలను చెబుతున్న తీరు చూస్తుంటే.. ఈ జనరేషన్ కు లెస్సన్స్ బాగానే నేర్పుతున్నట్లుగా ఉంది. ఫ్లాపులలో ఉన్న వర్మతో సినిమా చేయడం కరెక్టేనా అని అడిగితే.. ఫుల్లు ఫామ్ లో ఉండి.. తనకు నిన్నే పెళ్లాడుతా లాంటి హిట్ ఇచ్చిన కృష్ణవంశీతో తీసిన చంద్రలేఖ ఫెయిల్ అయిందని గుర్తు చేస్తున్నారు నాగ్. కొత్త దర్శకుడు అయినా సరే.. కళ్యాణ్ కృష్ణ తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన విషయాన్నీ చెబుతున్నారాయన.
తన ప్రయాణంలో ఇలాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయన్న నాగార్జున.. తండ్రి జీవితం సినిమాగా అంతగా బాగోదని తేల్చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలే ఈ మాత్రంగా ఆడతాయనే గ్యారంటీ లేదని.. అలాంటి సమయంలో.. పిల్లల సినిమాలకు ఇంకేముంటుందన్న నాగ్.. కష్టపడితేనే హిట్టు కొట్టడం సాధ్యం అవుతుందని చెబుతున్నారు. ఈ జీవిత సత్యాలు ఆయన పిల్లలలకే కాదు.. యంగ్ హీరోలు అందరికీ పాఠాలే.
