Begin typing your search above and press return to search.

ఇదిగో.. మన్మథుడితో మిల్కీ బ్యూటీ

By:  Tupaki Desk   |   1 Aug 2015 10:26 AM GMT
ఇదిగో.. మన్మథుడితో మిల్కీ బ్యూటీ
X
నాగార్జున సహా సీనియర్ హీరోలందరికీ ఈ మధ్య హీరోయిన్ల కొరత ఇబ్బంది పెట్టేస్తోంది. ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లతో డ్యూయెట్లు వేసుకునే అవకాశం వాళ్లకు లేదు. కొడుకు పక్కన చేస్తున్న ఏ హీరోయిన్ తో జత కట్టాలన్నా ఇబ్బందే. కాజల్, సమంత, తమన్నా.. ఈ ముగ్గురితోనూ నాగ్ జత కట్టలేడు. మనం సినిమాలో సమంత ఉంది కానీ.. నాగ్ కు జోడీ కాదు. ఐతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో మాత్రం నాగ్ తో కలిసి తమన్నా నటించబోతోంది. ఇందులో తమ్మూ నాగ్ కు జోడీగా చేస్తోందా లేదా అన్నది సస్సెన్సే. ఇందులో మరో హీరోగా కార్తి నటిస్తున్నాడు కాబట్టి తమ్మూ అతడికి జోడీ అనుకోవాలి.

ముందుగా శ్రుతి హాసన్ ను ఈ సినిమాకు హీరోయిన్ అనుకుని.. తర్వాత తమ్మూతో రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ లుక్స్ బయటికి రాలేదు. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని.. నెల కిందటే యూనిట్ యూరప్ బయల్దేరింది. ఈ రోజులు పీవీపీ వాళ్లు సినిమాకు సంబంధించి ఆన్ లొకేషన్ పిక్ ఒకటి ట్విట్టర్లో షేర్ చేశారు. ఫ్రాన్స్ లో షూటింగ్ జరుగుతుండగా ఆన్ సెట్స్ గెటప్స్ లో నాగ్, తమన్నా, కార్తి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో నాగ్ ను చూస్తే కార్తిది అతడిది సేమ్ ఏజా అన్న అనుమానం కలగకమానదు. నాగ్ ది కుర్చీకి అతుక్కుపోయే పేషెంట్ పాత్ర అన్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఈ ఫొటో చూస్తుంటే మాత్రం అలాగేమీ అనిపించట్లేదు.