Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురితో పోలిస్తే నాగ్ వెనకబడ్డట్టే..!

By:  Tupaki Desk   |   24 May 2023 9:00 PM GMT
ఆ ముగ్గురితో పోలిస్తే నాగ్ వెనకబడ్డట్టే..!
X
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ నలుగురిలో ఒకరైన కింగ్ నాగార్జున ఈమధ్య సినిమాల విషయంలో చాలా వెనకపడ్డారు. దాదాపు 100 సినిమాల అనుభవం ఉన్న నాగార్జున ప్రస్తుతం కథల ఎంపికలో కన్ ఫ్యూజన్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నది పక్కన పెడితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నలుగురు పెద్ద హీరోలుగా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలలో మిగతా ముగ్గురు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అంతేకాదు వారికున్న ఫ్యాన్ బేస్ తో సినిమా ఎలా ఉన్నా సందడి బాగానే వినిపిస్తుంది.

కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఈమధ్య ఎందుకో నిరుత్సాహంలో ఉన్నారు. తనయుల కెరీర్ సెట్ రైట్ చేసే పనుల్లో పడిపోయి తన సినిమాలను లైట్ తీసుకున్నాడు నాగార్జున. అందుకే ఆయనకు వరుస ఫ్లాపులు రుచి చూపించాయి. ఈ ఏడాది మొదట్లో వచ్చిన బంగార్రాజు సూపర్ హిట్ కాగా ఒక మంచి మాస్ హిట్ కోసం నాగార్జున ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక మాస్ కథ కోసం నాగార్జున వేట మొదలు పెట్టారని తెలుస్తుంది. నాగార్జున ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి.. వీర సింహారెడ్డి బాలకృష్ణ.. F2, F3 ఇలాంటి సినిమాలతో వెంకటేష్ వారంతా కూడా తమ ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు చేస్తున్నారు.

అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున ఒక మాసివ్ హిట్ కొడితే చూడాలని ఆసక్తిగా ఉన్నారు. నాగార్జున కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. అలాంటి కథల కోసం సెర్చింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే రైటర్స్ అందరికీ నాగార్జున నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఒక క్రేజీ కాంబో సెట్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారు నాగార్జున. ఈ క్రమంలోనే తన 100వ సినిమాను కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలా భారీ బడ్జెట్ తో సొంత ప్రొడక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉన్నారు నాగార్జున. మరి నాగ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫ్యాన్స్ ని ఎంతమేరకు మెప్పిస్తాయో చూడాలి.