Begin typing your search above and press return to search.

'ఆఫీసర్' వర్మ ఫిక్స్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   26 Feb 2018 5:22 PM GMT
ఆఫీసర్ వర్మ ఫిక్స్ అయ్యాడా?
X
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో చేస్తోన్న నాలుగవ సినిమాపై గత కొంత కాలంగా రూమర్స్ ఓ రేంజ్ లో వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో అయితే దర్శకుడు చాలా ఆలోచిస్తున్నాడు. చాలా రోజుల తరువాత వర్మ ఫుల్ స్క్రిప్ట్ పై మైండ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మధ్యలో ఎన్ని వివాదాలు చెలరేగినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక అసలు విషయంలోకి వస్తే.. సినిమాలో నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా టైటిల్ పై రీసెంట్ గా మరొక కొత్త వార్త హాట్ టాపిక్ మారింది. ఇంతకుముందు గన్ - డిపార్ట్మెంట్ అనే టైటిల్స్ సెట్ చేసినట్లు మీడియాల్లో బాగానే వినిపించాయి. అయితే కొత్తగా 'ఆఫీసర్' అనే టైటిల్ ను వర్మ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలైతే సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని ఆదివారం నాడే రిలీజ్ చేయాలి.

కానీ శ్రేదేవి మరణంతో వాయిదా వేశారు. శ్రీదేవి అంటే వర్మకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమె మరణించిన వార్త విని వర్మ షూటింగ్ పనులను కూడా ఆపేశారు. ప్రస్తుతానికైతే సినిమా టైటిల్ ఆఫీసర్ అని సెట్ చేసినట్లు టాక్ వస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.