Begin typing your search above and press return to search.

రెండవ 'యాత్ర'లో నాగార్జున?

By:  Tupaki Desk   |   14 Sept 2020 2:20 PM IST
రెండవ యాత్రలో నాగార్జున?
X
తెలుగు వారికి ఎప్పటికి గుర్తుండిపోయే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు అభివృద్ది సంక్షేమ పథకాలు జరిగాయి. కనుక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకమైన ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు అనడంలో సందేహం లేదు. ఆయన జీవిత చరిత్రతో ఇప్పటికే 'యాత్ర' అనే సినిమా వచ్చింది. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టీని వైఎస్సార్‌ గా చూపించారు. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన కారణంగా ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ ను చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకు సంబంధించి ఇప్పటికే స్ర్కిప్ట్‌ వర్క్‌ ను మొదలు పెట్టాడట.

యాత్ర 2 లో రాజశేఖర్‌ రెడ్డి మరియు జగన్‌ ఉంటారు. జగన్‌ చుట్టు కథ తిరుగుతూ యాత్ర 2 సాగుతుందని అంటున్నారు. జగన్‌ పాత్రకు ఒక యంగ్‌ హీరో నటించే అవకాశం ఉంది. ఇక రాజశేఖర్‌ రెడ్డి పాత్రను మళ్లీ మమ్ముటీ కాకుండా ఈసారి నాగార్జునతో నటింపజేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునకు మొదటి నుండి కూడా వైఎస్సార్‌ అంటే అభిమానం అంటూ ఉంటారు. కనుక ఆయన పాత్రలో ఈసారి నటించేందుకు నాగ్‌ ఓకే చెప్పే అవకాశం ఎక్కవగా ఉందని అంటున్నారు. నాగార్జున యాత్ర 2 లో నటిస్తే ఖచ్చితంగా అదో సంచలనం అవ్వడం ఖాయం అంటున్నారు. హీరోగా కంటే ఇలా కీలక పాత్రల్లో నటిస్తూ ఉండటం మంచిది అనే అభిప్రాయానికి నాగార్జున వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కారణం వల్లే యాత్ర 2 కు ఓకే చెప్పి ఉంటాడేమో అంటున్నారు. దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర 2' సినిమాపై త్వరలోనే పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.