Begin typing your search above and press return to search.

మళ్లీ కనిపించకుండా పోయి అక్కడ తేలింది

By:  Tupaki Desk   |   13 Dec 2020 11:22 AM IST
మళ్లీ కనిపించకుండా పోయి అక్కడ తేలింది
X
అక్కినేని హీరో సుమంత్‌ నటించిన మళ్లీ రావ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సినిమాలో సుమంత్‌ కు జోడీగా నటించిన ఆకాంక్ష సింగ్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. చక్కని నటనను కనబర్చిన ఈ అమ్మడు తెలుగులో ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమెకు రెండవ సినిమాగా నాగార్జున.. నాని నటించిన 'దేవదాస్‌' లో ఛాన్స్‌ దక్కింది. ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ రావ అంటూ వచ్చిన ఈ అమ్మడు మళ్లీ కనిపించకుండా పోయింది.

తెలుగులో ఈ అమ్మడు రీ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కూడా విఫలం అయ్యింది. దాంతో ఈమె కన్నడ.. తమిళ సినీ పరిశ్రమల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా పరిచయం అయిన ఆకాంక్ష ఇప్పుడు ఒక పెద్ద సినిమాతో హీరోయిన్‌ గా మరింత క్లోజ్‌ అవ్వబోతుంది. అజయ్‌ దేవగన్‌ నటిస్తూ నిర్మిస్తున్న మేడే సినిమాలో ఈమెకు లీడ్‌ రోల్‌ దక్కింది. సినిమాలో అమితాబచ్చన్‌ తో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కడంపై చాలా ఆనందంగా ఉన్న ఈ అమ్మడు దీంతో కెరీర్‌ లో సెట్‌ అయ్యేనా చూడాలి.