Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ హీరో త‌న పంథా మార్చాల్సిందేనా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 7:30 AM GMT
సీనియ‌ర్ హీరో త‌న పంథా మార్చాల్సిందేనా?
X
స‌క్సెస్ అన్నింటికి స‌మాధానం చెబుతుంది. అందుకే ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కే విలువ ఎక్కువ‌. అలాంటి స‌క్సెస్ కోసం ఇప్ప‌డు సీనియ‌ర్ స్టార్ల‌ నుంచి అప్ క‌మింగ్ హీరోల వ‌ర‌కు శ్ర‌మిస్తున్నారు. ఇదిలా వుంటే సీనియ‌ర్ హీరోల్లో ఒక్క‌రు మిన‌హా ముగ్గురు హీరోలు స‌క్సెస్ లో వున్నారు. విక్టరీ వెంక‌టేష్ నార‌ప్ప‌, దృశ్యం 2 సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది 'ఎఫ్ 2'కు సీక్వెల్ గా రూపొందిన 'ఎఫ్ 3'తో స‌క్సెస్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇక గ‌త ఏడాది వ‌రకు వ‌రుస ఫ్లాపుల్లో వున్న నంద‌మూరి బాల‌కృష్ణ 2021 డిసెంబ‌ర్ లో 'అఖండ‌'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో ఓ భారీ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామాలో బాల‌య్య న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే 'ఆచార్య‌'తో ఫ్లాప్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ ఈ ద‌స‌రాకు 'గాడ్ ఫాద‌ర్‌'తో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు.

న‌లుగురు సీనియ‌ర్ హీరోల్లో ముగ్గురు స‌క్సెస్ బాట‌లో వుంటే ఒక్క కింగ్ నాగార్జున‌ మాత్రం ఇప్ప‌టికీ ఫ్లాప్ ల‌లోనే వుండ‌టం ఆయ‌న ఫ్యాన్స్ ని తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయ‌న‌' త‌రువాత ఆ స్థాయి స‌క్సెస్ ని నాగ్ అందుకోలేక‌పోతున్నారు. వ‌రుస‌గా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌లో న‌టిస్తున్నా ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా హిట్ కావ‌డం లేదు. మాసీవ్ యాక్ష‌న్ సినిమాల‌తో పాటు తన పంథాకు పూర్తి భిన్నంగా 'అన్న‌మ‌య్య‌' లాంటి భ‌క్తిర‌సాత్మ‌క సినిమాల‌తోనూ ఆక‌ట్టుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన నాగ్ గ‌త కొంత కాలంగా ఆ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని రంజింప చేయ‌లేక‌పోతున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో 'బంగార్రాజు'తో హ‌డావిడి చేసిన నాగ్ ఫ‌రావాలేద‌నిపించాడు. కానీ త‌న స్థాయి విజ‌యాన్ని మాత్రం ద‌క్కించుకోలేక‌పోయారు. త‌న స‌హచ‌ర హీరోలు హిట్ లు సాధించిన స‌క్సెస్ బాట‌లో ప‌య‌నిస్తుంటే తాను కూడా వారి త‌ర‌హాలోనే స‌క్సెస్ ని సొంతం చేసుకోవాల‌ని 'ది ఘోస్ట్' సినిమాతో ప్ర‌య‌త్నించారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ లు ఆస‌క్తిక‌రంగా వుండ‌టంతో హిట్ గ్యారెంటీ అనే కామెంట్ లు వినిపించాయి.

ద‌స‌రా బ‌రిలో నిలిచిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకోలేక‌పోయింది. పంగ పోటీలో చిరు 'గాడ్ ఫాద‌ర్' వుండ‌టంతో ప్రేక్ష‌కుల అటెన్షన్ ఆ సినిమా వైపే వుండ‌టం, 'ది ఘోస్ట్‌' కు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించ‌డంతో పంగ సీజ‌న్ అయినా స‌రే నాగ్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌లేక మ‌ళ్లీ ఫ్లాప్ నే ద‌క్కించుకోవాల్సి వ‌చ్చింది.

ఇదిలా వుంటే కింగ్ నాగార్జున త‌న పంథా మార్చుకుంటే మంచిద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. సోలోగా కాకుండా మ‌ల్టీస్టారర్ మూవీస్ తో విక్ట‌రీ వెంక‌టేష్ త‌ర‌హాలో సేఫ్ గేమ్ ఆడుతూ ముందుకు సాగితే కెరీర్ మ‌రో మ‌లుపు తిర‌గడం ఖాయం అని చెబుతున్నారు. మ‌రి దీనికి నాగ్ ఏమంటాడో చూడాలి మ‌రి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.