Begin typing your search above and press return to search.

తనకు యాక్టింగ్ రాదనుకున్న నాగ్

By:  Tupaki Desk   |   24 March 2016 11:41 AM IST
తనకు యాక్టింగ్ రాదనుకున్న నాగ్
X
శివ అనే ఒక్క మూవీతోయ.. టాలీవుడ్ కొలతలే మార్చేశాడు అక్కినేని నాగార్జున. శివకి ముందు.. శివకి తర్వాత అంటూ తెలుగు సినిమాలకు ఓ బోర్డర్ ఉంది. అలాంటి మూవీతో స్టార్ట్ చేసి, అన్నమయ్య - శ్రీరామదాసు వంటి పౌరాణికాలు చేసి, ఇప్పుడు శ్రీ నమో వెంకటేశకు సిద్ధమవుతున్నాడు. ఇన్ని రకాల పాత్రలను పండించి, తనకు యాక్టింగ్ రాదని ఏ నటుడైనా తనను తాను అనుమానించుకుంటాడా? నాగ్ అదే చేశానంటున్నాడు.

మరొక్క రోజులో నాగ్ నటించిన ఊపిరి థియేటర్లలోకి వస్తోంది. ఇందులో కాళ్లు చేతులు కదలకుండా కేవలం ముఖ కవళికలతో మాత్రమే కేరక్టర్ పండించాల్సి ఉంటుంది. ఈ పాత్ర చేసేటపుడే తనకు యాక్టింగ్ రాదేమో అనుకున్నాడట నాగార్జున. ఏదైనా సీన్ తీసేటపుడు చేతులు - కాళ్లు కదులుతున్నాయేమో పరిశీలించడానికి ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. చిన్న కదలిక వచ్చిన మళ్లీ టేక్ చేసేవాళ్లం. ఇలా ఒక్కోసీన్ కి 20-30 టేకులు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఎక్కువ టేకులు తీసుకున్నపుడు తనకు నటన రాదని అనుకున్నాడట నాగార్జున. అయితే.. పూర్తయ్యాక మాత్రం తనకు బోలెడు సంతృప్తినిచ్చిన మూవీ అంటున్నాడు. నటుడిగా నాలైఫ్ ని మార్చిన మూవీ ఊపిరి అంటున్న నాగ్.. దీని తర్వాత విభిన్నమైన కేరక్టర్లను సృష్టించి దర్శకులు తన దగ్గరకు వస్తారంటున్నాడు.