Begin typing your search above and press return to search.
నాగ్ థాయిలాండ్ వెళ్తే మరి బిగ్ బాస్?
By: Tupaki Desk | 5 Oct 2020 11:00 AM ISTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి శని ఆదివారాల్లో ఈయన బిగ్ బాస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందుకోసం శనివారం రోజున నాగార్జున షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఒక్క రోజే రెండు ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తారు. గత సీజన్ లో తన బర్త్ డే సందర్బంగా విదేశాలకు వెళ్లిన నాగార్జున ఆ సమయంలో రమ్యకృష్ణ ను హోస్ట్ గా పంపించాడు. రమ్యకృష్ణ వచ్చిన రెండు రోజులు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సారి కూడా ఒక గెస్ట్ హోస్ట్ వస్తాడేమో అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ కోసం నాగార్జున థాయిలాండ్ వెళ్లబోతున్నాడు. దాదాపుగా రెండు మూడు వారాల పాటు అక్కడ షూటింగ్ ఉండే అవకాశం ఉంది. శనివారం షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం థాయిలాండ్ కు వెళ్లినా మద్యలో ఒక శనివారం ఆయన అక్కడే ఉండాల్సి ఉంటుంది. అంటే ఆ సమయంలో ఎవరు హోస్ట్ చేస్తారు అనేది చూడాలి. థాయిలాండ్ నుండి షో కోసం ప్రత్యేకంగా నాగార్జున వచ్చి వెళ్తారా అనేది కూడా చూడాలి. సాదారణంగా అయితే వచ్చి వెళ్లడం పెద్ద సమస్య కాదు. కాని కరోనా పరిస్థితుల్లో నాగార్జున వచ్చి వెళ్తారా లేదంటే గెస్ట్ హోస్ట్ తో నడిపిస్తారా అనేది చూడాలి.
ప్రభాస్ ఇప్పటికే షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లగా టాలీవుడ్ నుండి విదేశాలకు వెళ్లబోతున్న రెండవ హీరోగా నాగార్జున నిలిచారు. అతి త్వరలోనే ఆయన టీమ్ తో కలిసి విమానం ఎక్కబోతున్నారు. ఈ విషయమై ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటారు. ఇంటి సభ్యులతో థాయిలాండ్ లో ఉండి కూడా నాగార్జున ఆన్ లైన్ ద్వారా కలిసే అవకాశం ఉంటుంది. అలా ఏమైనా సెట్ చేస్తారా అనేది కూడా చూడాలి.